Nenu Student Sir Movie Review : ‘నేను స్టూడెంట్ సార్’ మూవీ ఫుల్ రివ్యూ

ఈ కుర్ర హీరోకి, అయితే నేడు విడుదలైన రెండవ సినిమా 'నేను స్టూడెంట్ సార్' ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

Written By: NARESH, Updated On : June 2, 2023 6:26 pm
Follow us on

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫర్: అనిత్ కుమార్
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్
దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: నాంది సతీష్ వర్మ

Nenu Student Sir Movie Review : ప్రముఖ నిర్మాత బెల్లం కొండా సురేష్ రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. బెల్లంకొండా గణేష్ హీరో గా నటించిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’ గత ఏడాది దసరా కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ ఓటీటీ లో విడుదలైన తర్వాత ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో మొదటి సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, మంచి సినిమాతోనే ఇండస్ట్రీ లోకి లాంచ్ అయ్యాడనే పేరు వచ్చింది ఈ కుర్ర హీరోకి, అయితే నేడు విడుదలైన రెండవ సినిమా ‘నేను స్టూడెంట్ సార్’ ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :

సుబ్బారావు ( బెల్లంకొండా గణేష్) అనే కుర్రాడికి ఐ ఫోన్ అంటే తెగ పిచ్చి, ఎలా అయినా ఐ ఫోన్ కొనాలనే తపనతో 9 నెలలు కస్టపడి 90 వేలు సంపాదించి ఐ ఫోన్ కొనుగోలు చేస్తాడు.ఈ ప్రపంచం లో తనకి ఒక్కటే ఐ ఫోన్ ఉన్నట్టుగా బిల్డుప్ ఇస్తూ ఆ ఫోన్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. సరిగ్గా ఈ ఫోన్ కొన్న రోజే కాలేజీ అనుకోని కొన్ని సంఘటనలు చోటు చేసుకొని పెద్ద గొడవలు జరిగి మొత్తం పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. పోలీసులు సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం ఫోన్ తీసుకొని , ఆ తర్వాత వెళ్ళేటప్పుడు తిరిగి ఇవ్వరు. ఫోన్ కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఫోన్ కనిపించదు. ఆ తర్వాత సుబ్బు కమిషినర్ వాసుదేవ్ (సముద్ర ఖని) ని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. అతడు కూడా సుబ్బు ని పట్టించుకోడు, దీనితో సుబ్బు కమిషినర్ కూతురుతో స్నేహం సంపాదించుకొని ఫోన్ సాధించాలి అనుకుంటాడు, ఈ క్రమం లోని సుబ్బు పై మర్డర్ కేసు నమోదు అవుతుంది. తర్వాత ఏమి జరిగింది అనేదే సినిమా స్టోరీ.

విశ్లేషణ:

కొత్త రకం కాన్సెప్ట్ ఉంటే సరిపోదు, ఆడియన్స్ చివరి వరకు సినిమాని ఎంజాయ్ చేసేలా ఉండాలి, అలా లేకపోతే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజి దగ్గరే ఆగిపోతుంది అనడానికి ఉదాహరణగా ఈ చిత్రం నిలిచిపోయింది.కొత్త రకం కాన్సెప్ట్ ని ఎంగేజ్ గా ఉండేట్టు తీసి ఉంటే ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.సినిమాని చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి అనిపించేది ఏమిటంటే , కేవలం ఒక్క ఫోన్ కోసం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అనిపిస్తుంది.ఇంత చిన్న విషయం కోసం హీరో ఏకంగా కమిషినర్ తో యుద్ధం చెయ్యడం వంటివి ఆడియన్స్ కి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కామెడీ పరంగా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి, కానీ హీరోయిన్ క్యారక్టర్ ని కూడా చాలా సిల్లీ గా చూపించినట్టు అనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే బెల్లం కొండ గణేష్ సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగున్నాడు. ఇతగాడి స్క్రిప్ట్ సెలెక్షన్స్ మరియు యాక్టింగ్ కూడా బాగానే ఉంది, ఈ చిత్రం లో కూడా అతను ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా నీట్ గా చేసాడు. ఇక హీరోయిన్ గా చేసిన అవంతిక దాసాని నటన యావరేజి గా ఉంది. ఈమె కనీసం డీలర్స్ కి లిప్ సింక్ కూడా చాలా సన్నివేశాలకు ఇవ్వలేదు. ఇక హీరో పాత్ర తర్వాత సినిమాకి ప్రధాన బలం గా నిల్చింది సముద్ర ఖని పాత్ర. ఇక సునీల్ కామెడీ కాసేపు మనకి రిలీఫ్ ని ఇస్తుంది. ఇక దర్శకుడు రాఖీ ఉప్పలపాటి కొత్త తరహా కథని ఆకట్టుకునే విధంగా చెప్పడం లో విఫలం అయ్యాడు.ఆయన సరిగ్గా డ్యూటీ చేసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లి ఉండేది.

చివరి మాట :

ఇది పక్క యావరేజి సినిమా, టైం పాస్ కోసం చూడాలి అనుకునేవాళ్లు థియేటర్స్ కి వెళ్లొచ్చు.

రేటింగ్ : 2 .25 /5