Homeప్రత్యేకంMangalavaram Review: మంగళవారం మూవీ ఫుల్ రివ్యూ...

Mangalavaram Review: మంగళవారం మూవీ ఫుల్ రివ్యూ…

Mangalavaram Review: ఒక సినిమాని చూస్తున్నంత సేపు మనల్ని మనం మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఆధ్యాంతం మొదటి నుంచి చివరి వరకు సినిమాలో లీనమైపోయి చూసాము అంటే ఆ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని అర్థం…ఇక దర్శకుడు కూడా మొదటి నుంచి చివరి వరకు ఆ స్టోరీ ని చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తే ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతాడు. ఇలాంటి క్రమంలోనే చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటే మరీ కొన్ని సినిమాలు మాత్రం మంచి హిట్స్ గా నిలబడిపోతాయి మరి కొన్ని సినిమాలు మాత్రం చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఏదో ఒక త్రిల్ ఫీల్ ఇస్తూ సినిమా చూస్తున్నంత సేపు కాకుండా కొద్దిరోజుల పాటు ఆ ఇంపాక్ట్ అనేది ఆ ప్రేక్షకులకు ఇస్తు ఉంటాయి..ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇదే క్రమంలో అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో వచ్చిన మంగళవారం సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కథ ఏంటి ఎలా ఉంది అనే వివరాలని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ సినిమా కథ లోకి వెళ్తే కథ లో పెద్ద ప్లాట్ పాయింట్స్ ఏమి లేకుండా ఒకే ప్లాట్ లో ఉంది. అదే మంగళవారం రోజున చాలామంది చనిపోతూ ఉంటారు అసలు ఈ ఊరికి, మంగళవారానికి ,ఈ చావులకి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? ఎందుకు ఈ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. అసలు ఈ మరణానికి శైలేజా ( పాయాల్ రాజ్ పుత్ ) కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఎస్ఐ నందిత శ్వేత కి ఈ కేసు తో సంబంధం ఏంటి అనే విషయాలను దర్శకుడు చాలా సస్పెన్స్ గా తెరకెక్కించాడు.ఇక ఆ మరణానికి మంగళవారానికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

అసలు ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

ముందుగా ఈ సినిమా కథ ఒకే ప్లాట్ లో నడిచే స్టోరీ కావడంవల్ల ప్రతి ప్రేక్షకుడు కూడా మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. అలాగే డైరెక్టర్ కూడా ఈ కథని ఎలాంటి డివియేషన్స్ ఏమీ లేకుండా సింగిల్ ప్లాట్ లో తను ఏదైతే చెప్పాలి అనుకున్నాడో ఆ పాయింట్ క్లియర్ కట్ గా సోది లేకుండా చెప్పేసాడు. అయితే సినిమా స్టోరీ చిన్నగా ఉన్నప్పటికీ కథనాన్ని మాత్రం దర్శకుడు చాలా వైవిధ్యంగా మార్చాడు. సింగిల్ ప్లాట్ లో వెళ్తున్న స్టోరీ కి ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఒక థ్రిల్ ఫిల్ చేశాడు. ఇక అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన అరెక్స్ 100 సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి.ఇక ఈ సినిమాలో పాయల. రాజ్ పుత్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని పోషించి తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించి ఈ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి … ఇక దర్శకుడు ఆమె పాత్రని డ్రైవ్ చేసిన విధానం కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది. అయితే ఎక్కడైతే ఈ సినిమా కొంచెం డల్ అవుతుంది అనుకున్నారో అక్కడ ఒక సాలిడ్ హ్యూజ్ హై ని ఇచ్చే ట్విస్ట్ ని ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు… దర్శకుడు ఈ సినిమాలో లేడీస్ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన పాయింట్ ని చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈయన మేకింగ్ గాని, స్టోరీ ప్లాట్ గాని సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి.ఇక డైలాగ్ రైటర్ తాజోద్దిన్ రాసిన డైలాగ్స్ కూడా ఈ సినిమా కి చాలా బాగా ప్లస్ అయ్యాయి…ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్ నాథ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సస్పెన్స్ ని రివిల్ చేసే సీన్స్ దగ్గర ఆ సీన్ కి హై ఇచ్చే మ్యూజిక్ ని అందించాడు. ఒక రకంగా ఈ సినిమా చాలా బాగా ఎలివేట్ అవ్వడానికి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణం అయిందనే చెప్పాలి. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది కొన్ని షాట్స్ తీయడానికి కెమెరా ఎక్కడ నుంచి పెట్టి తీసాడో తెలీదు కానీ అలాంటి షాట్స్ తీసి సినిమా కి.గ్రాండ్ విజువల్స్ ఇచ్చాడు.ఇక ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది…గుల్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ కూడా బాగుంది ఎందుకంటే కొన్ని సీన్స్ లో షార్ప్ ఎడిటింగ్ చేయడం వల్ల సినిమా లాగ్ అవ్వకుండా ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ కట్ చేస్తే ఆ సీన్ ల్యాగ్ అవకుండా ఒక క్లియర్ కట్ ఫీల్ వస్తుందో అలా చేస్తూ ఈ సినిమాకి ఎడిటింగ్ చేశాడు…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే పాయల్ రాజ్ పుత్ శైలజ అనే క్యారెక్టర్ లో చాలా నాచురల్ గా నటించింది. తెర మీద పాయల్ రాజ్ పుత్ కాదు శైలజ మాత్రమే కనిపించింది. అనెంత రీతిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.ఇక ఈ సినిమాకి లీడ్ రోల్ మొత్తం తనే కావడం వల్ల సినిమా మొత్తాన్ని తన భుజాల పైన మోసిందనే చెప్పాలి. ఇక అలాగే ఈ సినిమాకి అజయ్ ఘోష్ మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేస్తూ తన పాత్రని డైరెక్టర్ ఎలాంటి మోటీవ్ తో అయితే డిజైన్ చేశాడో ఆయన రాసిన దానికంటే ఆమె పర్ఫామెన్స్ తో ఆ పాత్రను డబుల్ త్రిబుల్ ఎలివేట్ చేశాడు… అలాగే నందిత శ్వేత కూడా ఎస్సై క్యారెక్టర్ లో ఓకే అనిపించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు పాత్రలని చేస్తూ సినిమా సక్సెస్ కి తమ వంతు పాత్ర పోషించారు…

ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
ఈ సినిమా స్టోరీ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.ఇక డైరెక్టర్ రాసుకున్న కథనం ట్విస్ట్ లు…బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయింది…అలాగే పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ కూడా ప్లస్ అయింది…

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే…
కొన్ని క్యారెక్టర్ లను కథ లోకి ఇన్వాల్వ్ చేయడం.లో డైరెక్టర్ కొద్ది వరకు తడబడ్డాడు…
ఇక ఇలాంటి పాయింట్ తో మన తెలుగు లో అయితే సినిమాలు ఎక్కువగా రాలేదు కానీ వేరే భాషల్లో వచ్చాయి… ఓటిటి పుణ్యమాని మన వాళ్ళు ఆ సినిమాలు చూశారు…

ఇక ఇవి మినహా ఇస్తే ఈ సినిమాకి పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమి లేవు
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని చూడచ్చు వాళ్ళకి బాగా నచ్చుతుంది…

ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular