https://oktelugu.com/

Bharateeyudu 2 Movie Review: ‘భారతీయుడు 2’ మూవీ ఫుల్ రివ్యూ…

1996 వ సంవత్సరంలో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంది అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : July 12, 2024 / 08:39 AM IST

    Bharateeyudu 2 Movie Review

    Follow us on

    Bharateeyudu 2 Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్ లాంటి నటుడు మరొకరు లేరనే విషయం మనందరికీ తెలిసిందే…అలాంటిది కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1996 వ సంవత్సరంలో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ సినిమా రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంది అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇండియాలో విపరీతంగా లంచాలు తీసుకోవడం, అవినీతి పెరిగిపోవడం తో సామాన్య జనాలు బతకడం చాలా కష్టం అవుతుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే సిద్దార్థ్ భారతీయుడు మళ్ళీ తిరిగి రావాలి. ‘సేనాపతి’ వస్తేనే ఇక్కడ సిస్టమ్ అంతా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో భారతీయుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాల గురించి తెలుసుకొని అతన్ని మొత్తానికైతే ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తాడు. మరి సేనాపతి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టం ఎలా సెట్ చేశాడు. అవినీతి పైన ఎలాంటి యుద్ధం చేశాడు. మొత్తానికైతే ఇక్కడున్న సిస్టమ్ ను మార్చడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని కూడా చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఇక ఎక్కడ రాజీ పడకుండా విజువల్స్ పరంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించి మరోసారి తన విజువలైజేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. ఇక సేనాపతి ఇండియాకు వచ్చేంతవరకు కొంచెం బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సేనాపతి క్యారెక్టర్ లో కమలహాసన్ మాత్రం చెలరేగిపోయాడనే చెప్పాలి. అలాగే శంకర్ కూడా కమల్ హాసన్ కి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

    అందువల్లే కమలహాసన్ ఆ పాత్రలో మొదటి నుంచి చివరి వరకు కూడా నటించడమే కాకుండా జీవించేసాడు. ముఖ్యంగా అలాంటి పాత్రలు చేయాలంటే నటుడికి ఘట్స్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ తో మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. తన నట విశ్వరూపాన్ని మరొకసారి ఈ సినిమాలో చూపించాడు. ఇక అవినీతిపైన సినిమాలు చేసి దాని కమర్షియల్ గా సక్సెస్ చేయడంలో శంకర్ ను మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాని కూడా అదే పాటర్న్ లో తీసి సక్సెస్ సాధించాడు…ఇక స్టైలిష్ గా ఒక సినిమాను తెరకెక్కించడం లో శంకర్ ను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది వాస్తవం. ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేశాడు…అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే శంకర్ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా హై ఫీల్ ఇస్తాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కమలహాసన్ తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా మరోసారి ఈ క్యారెక్టర్ ని ఛాలెంజ్ గా తీసుకొని చేశాడు. ఎక్కడ కూడా ఎలాంటి డివిషన్స్ లేకుండా అంతే ఎఫర్ట్ పెట్టి నటించడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తాన్ని కూడా కమలహాసన్ తన భుజాల మీద మోసుకెళ్లాడు. ఎప్పుడైతే సేనాపతి క్యారెక్టర్ ఎంటరవుతుందో అప్పటినుంచి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుంది. అలాగే కమలహాసన్ చేసిన కొన్ని సీన్లు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. నిజంగా తన యాక్టింగ్ ని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఏజ్ లో కూడా ఒక క్యారెక్టర్ కోసం అంత డెడికేషన్ తో వర్క్ చేసే మరొక నటుడిని మనం చూడలేము. కానీ కమలహాసన్ మాత్రం ప్రతి చిన్న మైన్యూర్ ఎక్స్ప్రెషన్ ను కూడా చాలా కేరింగ్ తో ఇస్తూ ఎక్కడ మైనస్ జరగకుండా తను ఎలాంటి పర్ఫామెన్స్ అయితే ఇవ్వాలో అలాంటి పర్ఫామెన్స్ ఇచ్చి సినిమాని సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించడనే చెప్పాలి.

    సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రను పోషించడం, కమలహాసన్ కి సపోర్టుగా నటిస్తూనే తను కూడా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. రకుల్ ప్రీతిసింగ్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ల వాళ్ళ పాత్రల్లో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో సక్సెస్ కూడా అయ్యారనే చెప్పాలి.

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే అనిరుధ్ తన మ్యూజిక్ ని అంత పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోయాడు. భారతీయుడు సినిమాలో ఏఆర్ రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ఇప్పుడు అనిరుధ్ అలాంటి మ్యూజిక్ ని ఇవ్వడం లో చాలా వరకు తడబడ్డాడనే చెప్పాలి. ఇక భారతీయుడు సినిమా ఒక మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దాంట్లో ఉన్న ప్రతి పాట కూడా ప్రేక్షకుడిని అలరిస్తుంది. కానీ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు పర్లేదు అనిపించినప్పటికీ, అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. కొన్ని సీన్లలో శంకర్ దగ్గరుండి మరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కొన్ని సీన్లలో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయింది.

    ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి విజువల్స్ చాలా వరకు ప్లస్ అయ్యాయి. రవి వర్మన్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉండడమే కాకుండా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా గ్రాండీయర్ గా ఎక్కడ ఎంత వరకు అవసరమో అంత డబ్బుల్ని పెట్టి ఈ సినిమాని రిచ్ లెవల్లో తీసుకురావడానికి శంకర్ భారీ ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఇక దానికి తోడుగా ప్రొడ్యూసర్స్ కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడంతో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అయితే వచ్చింది…

    ప్లస్ పాయింట్స్

    కమలహాసన్ యాక్టింగ్
    శంకర్ డైరెక్షన్
    విజువల్స్…

    మైనస్ పాయింట్స్

    ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం బోర్ గా అనిపిస్తుంది…
    కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మైనస్ అయింది…

    రేటింగ్
    ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా…