Hanuman Review: హాలీవుడ్ లో ఇప్పటివరకు చాలా సూపర్ మాన్ సినిమాలు వచ్చాయి. సూపర్ మాన్ అనగానే మనలో ఒక తెలియని ఫీల్ కలుగుతుంది. మనం చేయలేని పనులు స్క్రీన్ మీద తను చేస్తుంటే మనం ఆ సినిమాలో లీనమై తెరపైన ఆ సినిమాను చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాం…అయితే ఇలాంటి సినిమాలు పెద్దలతో పాటు పిల్లల్ని కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావడం లేదు అని చాలా సంవత్సరాల నుంచి మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్నకి హనుమాన్ సినిమా తో సమాధానం దొరికిందనే చెప్పాలి…తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారు ఒక సూపర్ మాన్ గా వచ్చిన ఈ హనుమాన్ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ని ఇస్తున్నారు. తేజ సజ్జా హీరో గా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా కాబట్టి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయాన్ని మనం బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా కథ విషయానికి వస్తే అంజనాద్రి అనే ఒక ప్రాంతంలో హనుమంతు( తేజ సజ్జా) అనే ఒక వ్యక్తికి సంబంధించిన కథ ఇది అయితే స్వతహాగా హనుమంతు ఒక బలహీనుడు. మా అక్కయినా అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) తన తమ్ముడిని ఒక్కన్నే వదిలేసి వెళ్తే బ్రతకలేడు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో తను పెళ్లి కూడా చేసుకోకుండా హనుమంతుతోనే ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే ఈ ప్రాంతం పాలగండ్ల ఆధీనంలో ఉంటుంది. ఇక వాళ్ల విక్రూత చేష్టలకి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఇష్టం వచ్చిన వారిని చంపుతూ వాళ్ల రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో బలహీనుడుగా ఉన్న హనుమంతు బలవంతుడు ఎలా అయ్యాడు అక్కడ జరుగుతున్న అరాచకాలను ఇలా ఆపాడు. అలాగే మైకల్ (వినయ్ రాయ్)అనే వ్యక్తి సూపర్ మేన్ ల ఎదగాలని కలలు కంటూ ఉంటాడు. ఇక తన డ్రీమ్ కి అడ్డొస్తున్నారని తన పేరెంట్స్ ని కూడా చంపేస్తాడు అలాంటి ఒక క్రూరమైన వ్యక్తి సూపర్ మ్యాన్ లా ఎందుకు మారాలనుకుంటాడు. ఇక మైకేల్ కి హనుమంతు కి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది. ఈ గొడవలో మైకల్ మీద హనుమంతు ఎలా విజయం సాధించాడు అనేది తెలియాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన పాయింట్ అద్భుతంగా ఉంది. అలాగే హనుమాన్ సూపర్ మాన్ కి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇందులో లాజిక్కులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ఇక హారర్, సోషియో ఫాంటసీ సినిమాల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్లకి లాజిక్కులు పెద్దగా అవసరం లేదు. మ్యాజిక్కులు చేస్తే సరిపోతుంది ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ సరిగ్గా అదే చేశాడు. హీరో ను తను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే సూపర్ గా ఉంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడికి హీరో హనంత్ కి కనెక్ట్ చేసిన పాయింట్ కూడా చాలా గొప్పగా ఉంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా తన పర్ఫామెన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాడనే చెప్పాలి.
అయితే హనుమంతు తనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత తను ఏం చేశాడు అనేది దర్శకుడు చాలా బ్యాలెన్స్డ్ గా డీల్ చేసుకుంటూ వచ్చాడు. ఇక హనుమంతుడు కనిపించే ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి… మైఖేల్ అనే క్యారెక్టర్ తనకి పవర్స్ కోసం ఫైట్ చేసే పాయింట్ నుంచి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత అంజనాద్రి ప్రాంతంలోకి సినిమా షిఫ్ట్ అవుతుంది. ఇక ఈ మూర్ఖుడైన మైకేల్ ని హనుమంతు ఎలా ఓడించాడు అనేది చాలా నీట్ గా ప్లజెంట్ గా ప్రజెంట్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో సూపర్ మాన్ సినిమాలకి తెలుగు లో కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది…
ఇక ఈ సినిమాకి విజువల్ ఎఫెక్స్ అయితే ప్రాణం పోసాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి కథని చెప్పాలంటే విజువల్స్ అనేవి అద్భుతంగా ఉండాలి. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఈ సినిమాను టాప్ లెవెల్ లో నిలబెట్టాయనే చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాని లో బడ్జెట్ లో చాలా గ్రాండ్ గా తీశాడు…ఇక ఈ సినిమా లో ఇన్ని బలాలు ఉన్నప్పటికీ, కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఈ సినిమాలో మైకేల్ అనే క్యారెక్టర్ కి సూపర్ పవర్ వస్తే తను ఏం చేయబోతున్నాడు అనేది క్లారిటీగా చూపించలేదు. అలాగే కొన్ని సీన్లలో ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది కనిపించలేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే వాళ్ల పరిధి దాటి ఇంకొక క్యారెక్టర్ లోకి దూరి వాళ్ల క్యారెక్టర్ పరిమితులను నటించినట్టు గా అనిపించింది. ఈ సినిమాలోకి హనుమంతుడు ఎంట్రీ ఇవ్వడానికి ఒక స్ట్రాంగ్ రిజన్ పెట్టీ ఉంటే ఇంకా బాగుండేది. ఆయన రావాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకున్నప్పుడే ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద మనకి కనిపించినప్పుడు మనం ఆ ఎమోషన్ ని నెక్స్ట్ లెవల్లో ఫీల్ అవుతాం..
అలా హనుమంతుడు రావడానికి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఆ ప్రాబ్లం ని హనుమంతుడు కాకుండా వేరే వాళ్ళు కూడా డీల్ చేయొచ్చు కదా అనే పాయింట్ అఫ్ వ్యూలో ఈ సినిమాని తెరకెక్కించారు. అలా కాకుండా హనుమంతుడు తప్ప ఎవరూ చేయలేరు అనే ఒక మోటివ్ పాయింట్ ని తీసుకొచ్చినట్టు అయితే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది… ఇక మొత్తానికి అయితే యంగ్ హీరో తేజ సజ్జ, ప్రశాంతవర్మ లు ఒక మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశ గా ముందుకు వెళ్తుంది.
నటీనటుల పర్ఫా మెన్స్…
ఇక ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా యంగ్ కుర్రాడు అయినప్పటికీ పర్ఫామెన్స్ లో చాలా మెచ్యూరిటీ ని చూపించాడు. ఆయన పోషించిన ప్రతి సీన్ లో కూడా తన ఐడెంటిటీ ని చూపిస్తూ వచ్చాడు.ఇంత చిన్న కుర్రాడు చాలా పెద్ద భారాన్ని మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ తను ఎక్కడ తడబడకుండా ఈ సినిమాలో పూర్తిగా ఎఫర్ట్ పెట్టీ నటించాడు. ఇక తన అక్కగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఆమె పోషించిన పాత్ర వల్ల కొన్ని ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యాయి. ఇక విలన్ గా చేసిన వినయ్ రాయ్ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ తన పరిధి మేరకు బాగా నటించింది. అలాగే వెన్నెల కిషోర్, గెటప్ శీను లాంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లలో ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ
సినిమాకి మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. నిజంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా చాలా కొత్తగా అందించారు. ఒక్కొక్క ఇన్స్టు మెంట్ ని వాడుతూ చేసిన మ్యూజిక్ లో ప్రతి సౌండ్ కూడా ప్రేక్షకుడిని మైమరిపించే విధంగా ఉంది. అలాగే అక్క తమ్ముడు మధ్య వచ్చే ఎమోషన్ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడానికి మ్యూజిక్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఇక సినిమాటోగ్రాఫర్ దాశరధి శివేంద్ర విషయానికి వస్తే తను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడనే చెప్పాలి. ఆయన మాత్రం ఎక్కడ తగ్గకుండా విజువల్స్ ని చాలా గ్రాండ్ గా చూపించడమే కాకుండా ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అవుట్ ఫుట్ ని అందించాడు.
ప్లస్ పాయింట్స్
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
తేజ సజ్జా యాక్టింగ్
కథ, కథనం, డైరెక్షన్
ఎమోషన్ సీన్స్
విఎఫ్ఎక్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే
కొన్ని క్యారెక్టర్లలో క్లారిటీ లేదు…
విలన్ పాత్రకి ప్రాపర్ గమ్యం లేదు.
ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5
చివరి లైన్ : కుర్రాళ్ళు కుమ్మేసారు…