నటీనటులుః కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, ప్రభు, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, మహేష్, రజిత తదితరులు
దర్శకత్వంః కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాణంః బన్నీవాసు, అల్లు అరవింద్
సంగీతంః జేక్స్ బెజోయ్
రిలీజ్ డేట్ః 19 మార్చి, 2021
Also Read: మూవీ రివ్యూః మోసగాళ్లు
కథః బస్తీ బాలరాజు (కార్తికేయ) ఒక డ్రైవర్. కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా వెళ్తాడు. ఓ రోజు పీటర్ అనే వ్యక్తి డెడ్ బాడీ పార్ట్స్ రవాణా చేస్తున్నప్పుడు.. మరణించిన వ్యక్తి భార్య మల్లిక (లావణ్య త్రిపాఠి)ను చూస్తాడు బాలరాజు. తొలి చూపులోనే ఆమెనుప్రేమిస్తాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రేమించాలని వెంట పడుతుంటాడు. దీంతో వెసుగు చెందిన మల్లిక బాలరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అసలు బాలరాజు జీవితం ఏంటి? మల్లిక బాలరాజును ప్రేమిస్తుందా? అన్నది మిగతా కథ.
కథనంః బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ సహజమైన నటనను ప్రదర్శించాడు. హీరో బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ద్వారా అతని నటన చాలా మెరుగుపడింది. లావణ్య డీ-గ్లామరస్ పాత్రను చక్కగా పోషింది. అద్భుతమైన నటనతో తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసింది. హీరో తల్లిగా సీనియర్ నటి ఆమని నటించారు. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంది. మురళి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పరిధి మేరకు నటించారు
Also Read: టాలీవుడ్ హీరోయిన్ హాట్ ఫోజ్
విశ్లేషణః దర్శకుడు కౌశిక్ పెగళ్ల మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. తొలి భాగంలో సాధారణ సన్నివేశాలు, కామెడీ ట్రాక్ తో అలరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. అయితే.. సెకండ్ హాఫ్ లో భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. అందులో ఆత్మలోపించినట్టుగా కనిపిస్తుంది. అవి అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. హీరో తల్లిదండ్రుల మధ్య నడిచే ట్రాక్ లో కూడా బిగి కొరవడిందని అనిపిస్తుంది. అక్కడక్కడా కొంచెం అతిగా కూడా అనిపిస్తుంది. ఎమోషనల్ కోర్ గా సాగే కొన్ని సన్నివేశాలు తగిన ఫీల్ ను మిస్సయినట్టుగా ఉంటాయి. కార్తికేయ-లావణ్య నటనే సినిమాకు బలం. సినిమాలో కొన్ని డైలాగులు బాగున్నాయి. మొత్తంగా..ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించగా.. సెకండ్ హాఫ్ పెదవి విరుపులాగా అనిపిస్తుంది. మరి, ఆడియన్స్ ఏ మేరకు కనెక్ట్ అవుతారు అన్నది చూడాలి. మిగిలిన రిజల్ట్ మీదనే ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.
బలాలుః కార్తికేయ, లావణ్య నటన, ఫస్ట్ హాఫ్, సంభాషణలు
బలహీనతలుః సెకండ్ హాఫ్, భావోద్వేగ సన్నివేశాల్లో కొరవడిన బిగి
లాస్ట్ లైన్ః “చావుకబురులో” సీరియస్ నెస్ లేదు
రేటింగ్ః 2
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్