Atharva Review: ప్రస్తుతం ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలని చూసి థ్రిల్ ఫీల్ అవ్వడానికి ప్రతి ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉంటున్నారు.మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాలను తీసి సక్సెస్ అవ్వడంలో మేకర్స్ కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే ఒక వారంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో చాలా ఎక్కువ సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు చెందిన సినిమాలే కావడం విశేషం… అయితే ఈ వారం కూడా అధర్వ అనే ఒక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు థ్రిల్ చేసింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా ఈ సినిమా కథ లోకి వెళ్తే…
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి చెందిన దేవ్ అధర్వ కర్ణ (కార్తిక్ రాజ్) పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ తో ఆయన పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొని సక్సెస్ ఫుల్ గా ఈవెంట్స్ ని పూర్తి చేస్తాడు కానీ అతనికి ఆస్తమా ఉండడం వల్ల మెడికల్ టెస్ట్ లో అతడు రిజెక్ట్ అవుతాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయనకి పోలీస్ జాబ్ అనేది రాకుండా పోతుంది. ఇక దాంతో క్లూస్ టీం గురించి తెలుసుకున్న ఆయన దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ ని పెట్టుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతాడు. ఇక దాంతో హైదరాబాద్ లోని క్లూస్ టీం విభాగంలో బయోమెట్రిక్ ఎనలిస్ట్ గా లో చేరుతాడు. అయితే తన నుంచి ఏ ఒక్కరిని కూడా హంతకులను తప్పించుకోకుండా అందరికీ శిక్ష పడేలా తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశ్యం తో తను ఈ జాబ్ లో చేరుతాడు. ఇక అదే క్రమంలో హీరోయిన్ జోష్ని తన లవర్ శివ ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో చనిపోయి నిర్జీవంగా పడి ఉంటారు.
ఇక సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వాళ్ల మధ్య జరిగిన గొడవల కారణం గా శివ తన లవర్ అయిన జోశ్ని చంపేసి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా రాసుకొని కేస్ ని క్లోజ్ చేస్తారు. కానీ అక్కడ జరిగిన ఆ కనిపించిన సంఘటనల ప్రకారం కర్ణ ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా గుర్తించి ఆ కేసుకు సంబంధించిన క్లూస్ ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయన కేస్ ని ఎలా సాల్వ్ చేశాడు,అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు. వాళ్లు ఆ మర్డర్ చేయడానికి గల మోటివ్ పాయింట్ ఏంటి అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి…
ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…
డైరెక్టర్ ఈ కథను ఎంచుకొని చాలా మంచి పని చేశాడు ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఉండకుండా ఒక థ్రిల్లింగ్ అంశాలని కథకి జోడిస్తూ ప్రతి క్షణం ప్రేక్షకుడు ఉలిక్కిపడే విధంగా ఈ సినిమాని తీయాలి అని దర్శకుడు అనుకున్నాడు కానీ కథ కథాంశం బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు దాన్ని స్క్రీన్ పైన షూట్ చేసే విధానం మాత్రం ప్రేక్షకులకు అంత నచ్చలేదనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక ప్రేక్షకుడు థ్రిల్లర్ సినిమా చూసేటప్పుడు త్రీల్ కి ఫీల్ చేసే ట్విస్ట్ లు అనేవి సినిమాల్లో వస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భం లో తను చాలా థ్రిల్ కి ఫీల్ అవుతాడు. ఇక అలాగే కథ కి యాప్ట్ అయ్యేలా ట్విస్ట్ లు ఇస్తు సినిమాలు చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకుడికి మంచి హై ఫీల్ వస్తుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కొద్దిసేపు ఎంగేజ్డ్ గా తీసుకెళ్లినప్పటికీ మధ్యలో అనవసరమైన పాటలు, ఫైట్లు హీరో ఎలివేషన్లు ఇస్తూ సినిమాని పెంట పెంట చేశారు. ఒక సినిమా ఎంగేజింగ్ గా వెళ్లాలంటే సరైన కథని ఎంచుకోవాలి.దాన్ని షూట్ చేసేటపుడు మన కథకి సంభందించిన డ్రైవింగ్ ఫోర్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకటి పది సార్లు చెక్ చేసుకోవాలి.అలాగే సినిమాల్లో క్యారెక్టర్స్ మధ్య ఉండే డెప్త్ ని ఎస్టాబ్లిష్ చేస్తూనే, ఆ క్యారెక్టర్లు ప్రవర్తించే విధానాన్ని ఒకటికి పది సార్లు చూసుకోవాలి లేకపోతే మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో సస్పెన్స్ గాని, థ్రిల్ కి ఫిల్ చేసే అంశాలు కానీ ఏవి ఉండవు అలాంటప్పుడు అదొక సాదాసీదా రోట్ట సినిమాగా మాత్రమే మిగిలిపోతుంది.
దీని ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ అనేది ఎలివేట్ అవ్వడంలో డీలాపడుతుంది అలా చేయడం వల్ల సినిమాకి పెద్ద మైనస్ గా మారుతుంది… అయితే ఈ సినిమాకి దర్శకుడు మహేష్ రెడ్డి రైటర్, డైరెక్టర్ రెండు అతనే కాబట్టి ఈ సినిమాని ఇంకా కొంచెం సస్పెన్స్ ని కల్గించే అంశాలను జోడిస్తూ అనవసరమైన హంగులకి పోకుండా స్ట్రైట్ ఫార్వార్డ్ గా మలిస్తే బాగుండేది. అలా చేస్తే ఈ సినిమాకి ఒక మంచి సినిమాగా ప్రేక్షకుల్లో గుర్తింపు ఉండేది.ఇక ఇప్పుడు ఏమైంది అంటే ఈ సినిమాలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ హంగులకు పోయి సినిమా మొత్తాన్ని నట్టేటా ముంచేసుకున్నాడు.ఈ సీన్లు చూస్తున్నప్పుడు అందులో జీవం లేదు ప్రేక్షకుడు ఎందుకు ఆ సినిమా చూడ్డానికి వచ్చాడో తనకి కూడా అర్థం కాని విధంగా ఈ సినిమా అస్తవ్యస్తంగా ఉండడం చూసిన ప్రతి ప్రేక్షకుడు తీవ్ర అసహనానికి గురయ్యాడు.ఇక మీదట ఇండస్ట్రీ కి వచ్చే ప్రతి డైరెక్టర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కించే సినిమాకి సాంగ్స్, ఫైట్లు లేకపోయినా పర్లేదు కంటెంట్ ని కరెక్ట్ గా ఫాలో అవుతూ సినిమాని మనం అనుకున్న రీతిలో తెరకెక్కించామా లేదా అనేది ఒకటికి పది సార్లు చూసుకొని క్రాస్ చెక్ చేసుకుని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కూడా ప్రేక్షకుడు దాన్ని ఆదరిస్తాడు. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాల్లో కంటెంట్ మాత్రమే బలం ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సినిమాల్లో హీరో హీరోయిన్స్ తో కూడా పెద్దగా అవసరం ఉండదు ఆ క్యారెక్టర్ లో ఎవరు చేసినా కూడా ఆ కథ మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి కథకు తగ్గట్టుగా డైరెక్షన్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో చేసిన కార్తీక్ రాజ్ తనదైన రీతిలో కొంతవరకు అలరించే ప్రయత్నం చేసినప్పటికీ డైరెక్టర్ అతన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. ఇక సిమ్రాన్ చౌదరి కూడా తనదైన రీతిలో కొంతవరకు యాక్టింగ్ చేసినప్పటికీ తనకి ఇంకా ఎక్కువ స్క్రీన్ స్కోప్ ఉండే విధంగా సీన్స్ ని డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఇక కభీర్ దుహన్ సింగ్ నటన కూడా ఓకే అనిపించింది… మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు వాళ్ల పాత్ర మేరకు నటించారు.డైరెక్టర్ ఎలాగైతే చెప్పాడో అలానే చేశారు అంతే తప్ప వాళ్ళ పూర్తి ఎఫర్ట్ అయితే పెట్టినట్టుగా కనిపించలేదు…
ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాయి చరణ్ పాకాల మ్యూజిక్ లో దమ్ము లేదు. పాటలు ఏమాత్రం వినలేకుండా ఉన్నాయి. బిజీయం కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదనే చెప్పాలి…ఇక అలాగే సినిమాటోగ్రాఫర్ చరణ్ మాధవనేని అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయి.అయితే ఆయన కూడా పూర్తిస్థాయిలో తన ఎఫర్ట్ అయితే పెట్టినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాల్లో కొన్ని కీలకమైన అంశాలను షూట్ చేసినప్పుడు గాని, ఆ స్టోరీ ప్రకారం కొన్ని కీ పాయింట్స్ రివిల్ చేసే టైంలో గాని విజువల్స్ అనేవి చాలా పూర్ గా ఉన్నాయి అలాగే లైటింగ్ అయితే రెగ్యులర్ లైటింగ్ ఫార్ములానే వాడారు… ఇక ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ వచ్చేసి
కథ
ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ వచ్చేసి
ఒక కథను మినహాయిస్తే మిగిలిందంతా ఈ సినిమాకు మైనస్ అనే చెప్పాలి.ఒక్కచోట కూడా దర్శకుడు తన మార్క్ చూపించాలని అనుకోకుండా తనకు నచ్చింది తనకు తోచినట్టుగా తీసుకుంటూ వచ్చాడు. అంతే తప్ప అది ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా..? లేదా అనే ఒక చిన్న పాటి ఆలోచన కూడా చేయకపోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్ గా చెప్పాలి…
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2/5