ఆ క్లాసిక్ సినిమాకి అనేక గొడవలు !

తెలుగు సినీ చరిత్రలో ‘పాతాళభైరవి’ తరువాత మళ్ళీ అలాంటి మరో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ‘మిస్సమ్మ’. అవి 1955 కాలం నాటి రోజులు. నాగిరెడ్డి, చక్రపాణి వంటి దిగ్గజాలు తెలుగు సినిమాని శాసిస్తోన్న రోజులు. అయితే, చక్రపాణిలో మంచి సినిమా రచయిత కూడా ఉన్నాడు. పైగా తమ చేతుల్లోనే తెలుగు సినిమా వర్ధిల్లుతున్న రోజులు అవి, దాంతో చక్రపాణి ఎలాంటి కథ రాసినా, ఆ కథతోనే సినిమా తీసేవారు. ‘మిస్సమ్మ’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ […]

Written By: admin, Updated On : April 1, 2021 10:21 am
Follow us on


తెలుగు సినీ చరిత్రలో ‘పాతాళభైరవి’ తరువాత మళ్ళీ అలాంటి మరో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ‘మిస్సమ్మ’. అవి 1955 కాలం నాటి రోజులు. నాగిరెడ్డి, చక్రపాణి వంటి దిగ్గజాలు తెలుగు సినిమాని శాసిస్తోన్న రోజులు. అయితే, చక్రపాణిలో మంచి సినిమా రచయిత కూడా ఉన్నాడు. పైగా తమ చేతుల్లోనే తెలుగు సినిమా వర్ధిల్లుతున్న రోజులు అవి, దాంతో చక్రపాణి ఎలాంటి కథ రాసినా, ఆ కథతోనే సినిమా తీసేవారు. ‘మిస్సమ్మ’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ కథ విన్న అప్పటి సినీ ప్రముఖులు చక్రపాణి పై చాల ఆరోపణలు చేశారు.

మరి యాభైయేళ్ళ కిందట, అదీ ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగా పరిచయమైనా లేని ఒక పరాయి అబ్బాయిని నమ్మి అతనికి భార్యగా నెలల తరబడి నటించడానికి ఎలా ఒప్పుకుంటుంది ? అసలు నమ్మశక్యం కానీ ఇలాంటి పాయింట్ల పై కథలు రాసి, సినిమాలు చేస్తే ఉన్నది అమ్ముకోవడమే నాగిరెడ్డి, ఇక నుండి ఆ చక్రపాణితో సినిమా వ్యాపారం మానుకో’ అంటూ అప్పుడు చక్రపాణికి, నాగిరెడ్డికి గొడవలు పెట్టే ప్రయత్నం కూడా చేశారు.

అయితే మల్టీ స్టారర్ సినిమాలతో తెలుగు సినిమా పై కాసుల వర్షం కురుస్తూ.. తెలుగు సినిమాకి స్వర్ణయుగం నడుస్తోన్న రోజులు అవి. అందుకే చక్రపాణి రాసిన కథను నాగిరెడ్డి, ఎల్వీప్రసాద్ నమ్మారు. కథలో కల్పితం ఉన్నా.. గొప్ప హాస్యాన్ని పండించే స్కోప్ ఉందని.. ఎల్వీ ప్రసాద్ నాగిరెడ్డికి భరోసా ఇచ్చారట. దాంతో ఎన్ని విమర్శలు వచ్చినా నాగిరెడ్డి, చక్రపాణితో ఈ కథతోనే సినిమా చేయడానికి సిద్ధపడిపోయారు.

ఈ చిత్రంలో అప్పటి అతి పెద్ద హీరోలనే హీరోలుగా పెట్టి ఈ సినిమా తీయాలనుకున్నారు. అలా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులను హీరోలకు అనుకున్నారు. అయితే మిస్సమ్మగా ఎవర్నీ తీసుకోవాలి ? అసలు ఆ స్థాయి ఉన్న నటి ఎవరు ఉన్నారు ? అందరికీ ఒక్క భానుమతి మాత్రమే కనిపించింది. ఆమెనే మిస్సమ్మగా ఫిక్స్ చేసి సినిమా మొదలుపెట్టారు. కానీ, చక్రపాణికి ఆమెకు మధ్య జరిగిన చిన్న పాటి మనస్పర్ధతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక మిస్సమ్మ పాత్రలో మహానటి సావిత్రిని తీసుకున్నారు. మొత్తానికి అలా అనేక ఆరోపణలు విమర్శలతో మొదలైన మిస్సమ్మ సినిమా విడుదల అయ్యాక ఎంతో ప్రజాదరణ పొంది ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయింది.