న‌య‌న‌తార‌కు ఆ హీరోతో సంబంధంః న‌టుడు తీవ్ర‌వ్యాఖ్య‌లు

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌పై కోలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకు, సినీ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ తో న‌య‌న‌తార సంబంధం కొన‌సాగిస్తోంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ వ్యాహ్య‌లు చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌య‌న‌తార అభిమానులు సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. గాయ‌ని చిన్మయి కూడా ఈ […]

Written By: Bhaskar, Updated On : April 1, 2021 10:04 am
Follow us on


ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌పై కోలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకు, సినీ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ తో న‌య‌న‌తార సంబంధం కొన‌సాగిస్తోంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ వ్యాహ్య‌లు చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఈ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న‌య‌న‌తార అభిమానులు సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. గాయ‌ని చిన్మయి కూడా ఈ విష‌యంపై తీవ్రంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. రాధార‌వి మాట‌తీరు, ప్ర‌వ‌ర్త‌న చూసిన విసుగొచ్చింద‌ని, ఆయ‌న బ‌హిరంగంగానే బూతులు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌ను వేధిస్తుంటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం. ఇలాంటి వాళ్ల‌ను పార్టీలు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఎలా పెట్టుకుంటార‌ని నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా.. రాధార‌వి వంటి వారికి ఓట్లు వేయొద్ద‌ని కూడా చిన్మ‌యి విజ్ఞప్తి చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు న‌య‌న‌తార‌ ఫ్యాన్స్ కూడా సోష‌ల్ మీడియా వేదికగా రాధార‌విపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌చేస్తున్నారు. ఇలాంటి చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌లు చేసిన రాధార‌వికి త‌గిన బుద్ధిచెప్పాల‌ని కామెంట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విధంగా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే వారిని పార్టీని నుంచి బ‌హిష్క‌రించ‌కుండా.. నేత‌లు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా.. గ‌తంలోనూ న‌య‌న‌తార‌పై నోరుపారేసుకున్నారు రాధార‌వి. శ్రీరామ‌రాజ్యం సినిమాలో సీత పాత్ర పోషించడంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. న‌య‌న‌తార వంటి వారు కూడా సీత పాత్ర పోషించ‌డం ఖర్మ అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇప్పుడు.. ఏకంగా న‌య‌న తార క్యారెక్ట‌ర్ ల‌క్ష్యంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు ప్ర‌చారంలోకి రావ‌డంతో.. హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్