https://oktelugu.com/

Mahesh Babu:అట్టర్ ఫ్లాప్ అని టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహేష్ బాబు సినిమా ఇది..

కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమా బంపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయింది. ఈ మూవీ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఇలాంటి సినిమాల్లో నటిస్తే క్రేజీ తగ్గుతుందని చెప్పారట. అయినా మహేష్ బాబు బలవంతంగా ఈ సినిమాలో నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2024 / 02:26 PM IST

    maheshbabu

    Follow us on

    Mahesh Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ప్రత్యేక స్థానం ఉంది. కొంత మంది తండ్రులు హీరోలు అయి ఉండి వారి కుమారులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. కానీ సొంతంగా రాణించలేకపోయారు. కానీ మహేష్ బాబు చిన్నప్పుడే తండ్రితో సినిమాల్లోకి వచ్చి.. ఆ తరువాత సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ నేటి యువతకు పోటీ ఇస్తున్న మహేష్ ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించాడు. తాజాగా ఆయన రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ గురించి ఓ ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన ఓ సినిమా ముందుగా ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తరువాత బంపర్ హిట్టు కొట్టింది. ఎంతకీ ఏ సినిమా అంటే?

    మహేష్ బాబు సోలో హీరో అని కొందరు అభిప్రాయం. కానీ తాను మాస్ హీరోనని నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘అతడు’ సినిమాతో మహేష్ కెరీర్ టర్న్ అయిందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి మహేష్ ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తున్నాడు. అయితే అంతకు ముందు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కనిపించాడు. ఇలా ఓ మూవీ రిలీజ్ అయిన తరువాత మహేష్ మాస్ గా కనిపించలేదని నిరాశ చెందారు. కానీ ఆ తరువాత ఈ మూవీ బంపర్ హిట్టు కొట్టింది.

    ఆ సినిమానే మురారి. కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమా బంపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయింది. ఈ మూవీ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఇలాంటి సినిమాల్లో నటిస్తే క్రేజీ తగ్గుతుందని చెప్పారట. అయినా మహేష్ బాబు బలవంతంగా ఈ సినిమాలో నటించారు. అయితే సినిమాలో రిలీజ్ అయినా తరువాత మొదటి రోజు ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా మహష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

    కానీ సినిమా మౌత్ పబ్లిసిటీ బాగా అయింది. స్టోరీ బాగుండడంతో పాటు మహేష్ యాక్టింగ్ కు తోడవడం సినిమాకు ప్లస్ అయింది. దీంతో రిలీజ్ అయిన ఈవినింగ్ షో నుంచి సినిమాకు జనం పెరిగారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈసినిమా ద్వారా మహేష్ బాబుకు స్టార్ గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి మహేష్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.