Movie Flop Analysis: ఏళ్ల తరబడి సమయం కేటాయించి గేమ్ ఛేంజర్ చేశాడు రామ్ చరణ్. ఫలితం మాత్రం నిరాశపరిచింది. దానికి తోడు వివాదాలు, ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే ఇదే తరహాలో చిరంజీవికి ఓ చిత్రం చేదు అనుభవం మిగిల్చింది. ఆ చిత్రం ఏమిటో చూద్దాం..
సినిమా జూదంతో సమానం. ఓ సినిమా విజయాన్ని అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. కంటెంట్ బాగున్నా, దర్శకుడు మంచి అవుట్ ఫుట్ ఇచ్చినా, హీరో చెమటోడ్చినా ఫలితం దక్కకపోవచ్చు. ఆడియన్స్ మూడ్, విడుదల సమయం, పోటీ, ట్రెండ్ తో పాటు పలు విషయాలు సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తాయి. అందరూ హిట్ కొట్టాలనే సినిమా తీస్తారు. కానీ కొందరికే విజయం లభిస్తుంది. ఒక అంచనా ప్రకారం విడుదలయ్యే ప్రతి 100 చిత్రాల్లో 2 మాత్రమే హిట్ అవుతాయట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా నిర్మాణం ఎంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారమో.
Also Read: ఇక మీదట దిల్ రాజు కి మెగా హీరోల నుంచి అవకాశాలు రావా..?
2025 సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్(GAME CHANGER), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తర్వాత డాకు మహారాజ్. అనూహ్యంగా పెద్దగా అంచనాలు లేని సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం అందుకుంది. 2025 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దాదాపు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాత కాగా ఓ చోట పోయింది, మరో చోట రాబట్టాడు.
గేమ్ ఛేంజర్ తో మేము భారీగా నష్టపోయాము. దర్శకుడు, హీరో కనీసం ఫోన్ చేయలేదని నిర్మాత శిరీష్ అసహనం తెలపడం వివాదాస్పదం అయ్యింది. రామ్ చరణ్(RAM CHARAN) ఫ్యాన్స్ ఫైర్ కావడంతో శిరీష్, దిల్ రాజు వివరణ ఇచ్చుకున్నారు. శిరీష్ క్షమాపణలు చెప్పారు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ ప్రయత్న లోపం లేదు. శంకర్ ఏళ్ల తరబడి గేమ్ ఛేంజర్ తెరకెక్కించినా సహకరించాడు. మరో చిత్రం చేయకుండా పూర్తి సమయం గేమ్ ఛేంజర్ కి కేటాయించాడు. రామ్ చరణ్ మూడేళ్ళ కష్టానికి ఫలితం దక్కలేదు. నిర్మాత దిల్ రాజు(DIL RAJU) ఆర్థికంగా నష్టపోయాడు.
Also Read: సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘హరి హర వీరమల్లు’ ట్రోల్స్,మీమ్స్..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఇదే తరహా అనుభవం చిరంజీవి(CHIRANJEEVI)కి ఎదురైంది. అది మూవీ అంజి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా అంజి చిత్రం తెరకెక్కింది. అంజి(ANJI) మూవీ షూటింగ్ సుదీర్ఘంగా 6-7ఏళ్ళు సాగింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు గ్రాఫిక్ వర్క్ కి అధిక సమయం పట్టింది. చిరంజీవి ఇతర చిత్రాలు చేస్తూనే అంజి చిత్రానికి డేట్స్ కేటాయిస్తూ వచ్చారు. ఇక పతాక సన్నివేశాల కోసం ఆయన రెండేళ్లు ఒకే కాస్ట్యూమ్ ధరించాల్సి వచ్చిందట. ఎట్టకేలకు అంజి 2004 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ప్లాప్ టాక్ తో భారీ నష్టాలు మిగిల్చింది. చిరంజీవి కష్టం వృధా అయ్యింది.