WCL recruitment 2021: వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 211 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం 211 ఉద్యోగ ఖాళీలలో మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలు 167 ఉండగా సర్వేయర్ మైనింగ్ ఉద్యోగ ఖాళీలు 44 ఉన్నాయి.

వాలిడ్ మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ లేదా మైనింగ్ / మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 2021 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపడతారు. అక్టోబర్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా నవంబర్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
http://westerncoal.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీగా మేలు జరగనుందని చెప్పవచ్చు.