Mosagallaku Mosagadu Re Release: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తిరుగులేని సూపర్ స్టార్, సాంకేతిక పరంగా , టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీ ని ఒక స్థాయి నుండి మరో స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు, సరికొత్త జానర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడు. గత ఏడాది ఆయన అభిమానుల సమక్షం లోనే కేక్ కట్ చేసాడు, కానీ ఈ ఏడాది మాత్రం ఆయన మన మధ్యలో లేరు, కొద్దినెలల క్రితమే ఆయన చనిపోయాడు.
ఆయన చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.ఇది ఇలా ఉండగా నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం, టాలీవుడ్ కి మొట్టమొదటి కౌ బాయ్ సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.
ఈ చిత్రం మొట్టమొదటి కౌ బాయ్ సినిమా మాత్రమే కాదు, మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కూడా. టికెట్ రేట్లు రూపాయి విలువ కూడా లేని ఆ రోజుల్లో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. అప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్ రికార్డు కలెక్షన్స్ మొత్తాన్ని అధిగమించిన చిత్రమిది.
అలాంటి సినిమాని నేడు రీ రిలీజ్ చేస్తే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది.నేడు కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా గ్లిమ్స్ వీడియో ని ఈ థియేటర్స్ లో ప్లే చెయ్యబోతున్నారు అని చెప్పడం తో, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మంచి గ్రాస్ ని దక్కించుకుంది. ఇక ఈరోజు మొత్తానికి కలిపి సుమారుగా 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
Recommended Video: