https://oktelugu.com/

Karthika Deepam :డాక్టర్ బాబు ను వదలని మోనిత.. ఈసారి పక్క ప్లాన్ తో అలా!

Karthika Deepam :బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కార్తీక్ చేసిన పొరపాటు వల్ల పేషెంట్ చనిపోవడంతో కార్తీక్ చాలా బాధ పడతాడు. పేషెంట్ కుటుంబసభ్యులను గుర్తుచేసుకుంటాడు. ఇదంతా మోనిత చేసిన ప్లాన్. అక్కడ ఒక నర్సు తో కార్తీక్ కు మత్తు పదార్థం కలిపిన కాఫీ ని తాగించేలా చేస్తుంది. ఇక మోనిత దగ్గరికి ప్రియమణి వచ్చి ఏం చేయట్లేదమ్మ ఎలా ఉంటున్నావ్ అని అనేసరికి చూడు ఏం జరుగుతుందో అని చెబుతుంది […]

Written By: , Updated On : December 4, 2021 / 09:48 AM IST
Follow us on

Karthika Deepam :బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కార్తీక్ చేసిన పొరపాటు వల్ల పేషెంట్ చనిపోవడంతో కార్తీక్ చాలా బాధ పడతాడు. పేషెంట్ కుటుంబసభ్యులను గుర్తుచేసుకుంటాడు.

Karthika Deepam

Karthika Deepam

ఇదంతా మోనిత చేసిన ప్లాన్. అక్కడ ఒక నర్సు తో కార్తీక్ కు మత్తు పదార్థం కలిపిన కాఫీ ని తాగించేలా చేస్తుంది. ఇక మోనిత దగ్గరికి ప్రియమణి వచ్చి ఏం చేయట్లేదమ్మ ఎలా ఉంటున్నావ్ అని అనేసరికి చూడు ఏం జరుగుతుందో అని చెబుతుంది మోనిత.

హాస్పిటల్లో పేషెంట్ భార్య, పిల్లలు బాగా ఏడుస్తుంటారు. ఆ పేషెంట్ భార్య కార్తీక్ దగ్గరికి వచ్చి
ఏడుస్తూ కార్తీక్ పై అరుస్తుంది. కాపాడుతావని చెప్పి ఇలా ఎందుకు చేసావు అని నా పిల్లల పరిస్థితి ఏమి కావాలి అంటూ నా ఉసురు మీకు తగులుతుంది అని కార్తీక్ కు శాపాలు పెడుతుంది.

నా పిల్లల లాగే నీ పిల్లలు ఏడవాలి అని వాళ్లకి ఇదే పరిస్థితి రావాలని ఏవేవో గట్టి శాపాలు పెడుతుంది. కార్తీక్ మాత్రం ఏమనకుండా మౌనంగా ఉంటాడు. ఇలా జరిగింది ఏంటి అని బాధ పడతాడు. మరోవైపు ఇంట్లో సౌందర్య, ఆనందరావు పిల్లలతో సంతోషంగా గడుపుతూ కనిపిస్తారు.

Also Read: డాక్టర్ బాబు ను వదలని మోనిత.. ఈసారి పక్క ప్లాన్ తో అలా!

ఇక పిల్లలు పొడుపుకథలు వేస్తూ సరదాగా ఆట పట్టిస్తుంటారు. సౌందర్య కాసేపు వారితో గడిపి కార్తీక్ గొప్పతనం గురించి చెబుతుంది. చాలా మంచి వాడని గొప్ప డాక్టర్ అని చెబుతుంది. అప్పుడే హిమ కూడా కార్తీక్ సర్జరీ ఎలా చేస్తాడో నటించి చూపిస్తుంది.

అక్కడికి ఆదిత్య రావటంతో పిల్లలను బయటకు తీసుకెళ్ళమని అంటుంది సౌందర్య. ఆదిత్య పిల్లలతో నేను తీసుకెళ్లను అంటూ సరదాగా అంటుంటాడు. మరోవైపు కార్తీక్ ఇంటికి బయలు దేరుతుండగా ఆ పేషెంట్ భార్య మళ్ళీ వచ్చి కార్తీక్ పై అరుస్తుంది. మీ కుటుంబం నాశనం కావాలి అంటూ మట్టి జల్లుతుంది.

Also Read: బిగ్ బాస్ లో షన్ను ని కాదని వేరే కంటస్టెంట్ కి మద్దతు తెలుపుతున్న దీప్తి సునైనా…