https://oktelugu.com/

Akhanda: బాలయ్య అఖండ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది ఎవరంటే…

Akhanda: నందమూరి నటసింహం బాలయ్య తాజాగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. సింహా, లెజెండ్ తర్వాత అఖండతో హ్యాట్రిక్ హిట్ సాధించారు బాలయ్య – బోయపాటి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించి ఆకట్టుకున్నారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. బాలయ్య సరసన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 09:50 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి నటసింహం బాలయ్య తాజాగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. సింహా, లెజెండ్ తర్వాత అఖండతో హ్యాట్రిక్ హిట్ సాధించారు బాలయ్య – బోయపాటి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించి ఆకట్టుకున్నారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ కూడా తన నటనతో, గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఫ్యామిలి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ విలనిజంతో కొత్త అవతారం ఎత్తి దుమ్ములేపాడు. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. త‌మ‌న్ మ్యూజిక్‌ అయితే ధియేటర్లలో మోత మోగిస్తుంది.

    balakrishna akhanda movie ott rights brought by disney and hotstar

    Also Read: బాలయ్య ‘అఖండ’ సినిమా చూస్తూ ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ మృతి

    ద్వార‌క క్రియేష‌న్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి తగ్గేదే లే అన్న లెవెల్ లో సినిమాను నిర్మించారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ హక్కులను ఎవరు దక్కించుకున్నారు అనే అంశంపై సోషల్ మీడియా లో గట్టిగా చర్చించుకుంటున్నారు. కాగా అఖండ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తుంది. భారీ రేటుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగిందని సమాచారం. ఈ సినిమాతో హాట్ స్టార్ కచ్చితంగా జాక్ పాట్ కొట్టినట్లే అంటూ ఓటీటీ విశ్లేషకులు కూడా అంటున్నారు. ప్రస్తుతం కలెక్షన్ ల పరంగా కూడా బాలయ్య సినిమా దుమ్మురేపుతుంది. ఈ సినిమా ఓటిటికి ఇంకా చాలా రోజులు సమయం ఉన్న సినిమా బాగుండడంతో నెటిజన్లు ఈ విషయంపై సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

    Also Read: బాలయ్య అఖండ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది ఎవరంటే…