Monalisa controversy latest updates: కుంభమేళా లో మోనాలిసా అనే అందాల అమ్మాయి పేరు ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కుర్రాళ్ళు ఈమె అందాలను చూసి మెంటలెక్కిపోయారు. ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. ఈమె అందాన్ని చూసి బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అయితే ఇతని పై రీసెంట్ గా మోనాలిసా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే రేపింది. సనోజ్ మిశ్రా షూటింగ్ సమయం లో ఎక్కడ పడితే అక్కడ నా శరీరాన్ని తాకుతూ చాలా ఇబ్బందికి గురి చేసాడని, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలపై సనోజ్ మిశ్రా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆమె మాట్లాడుతున్నవాణ్ణి పచ్చి అబద్దాలే అని, ఈమె పై త్వరలోనే పరువు నష్టం దావా కేసు ని వేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే మోనాలిసా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లిని సనోజ్ మిశ్రా వ్యతిరేకించాడు. దీంతో మోనాలిసా మీడియా ముందుకొచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇక సనోజ్ మిశ్రా మోనాలిసా వ్యాఖ్యలకు స్పందిస్తూ ‘ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్దాలు. కేవలం నేను ఆమె పెళ్లి ని వ్యతిరేకించాను అనే కారణంతోనే , పగతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నేను మాత్రమే కాదు, మోనాలిసా తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఆ వివాహం చెల్లదు. కేవలం ఆమె మంచి కోరుకొని మాత్రమే నేను ఆ పెళ్లిని వ్యతిరేకించాను. అందుకోసం కెరీర్ ని ఇవ్వాలని అనుకున్న నాపైనే ఇలాంటి నిందలు వేస్తుందని ఊహించలేదు. ఈ విషయాన్ని అంత తేలికగా వదలను, మరో రెండు మూడు రోజుల్లో ఆమె పై పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఆమెతో చేస్తున్న సినిమాని కూడా ఆపేస్తున్నాను. ఇప్పటికే చాలా ఖర్చు చేశాను, నష్టం వచ్చినా పర్వాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: మహేష్ బాబు తో సినిమా చేయడం అంత ఈజీ కాదంటున్న స్టార్ డైరెక్టర్…
అయితే మోనాలిసా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అదే విధంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను డైరెక్టర్ షూటింగ్ స్పాట్ లో నిజంగా ఇబ్బంది పెట్టుంటే , ఆరోజే నువ్వు ఆయన చెంప పగలగొట్టి ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు కదా, ఆరోజు ఎందుకు అలా చెయ్యలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మోనాలిసా ని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే మోనాలిసా కి సపోర్టు చేస్తూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన అమ్మాయి, కాబట్టి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తప్పవు, డైరెక్టర్ చెప్పిన దానిని బట్టీ చూస్తుంటే మోనాలిసా ని తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడని, ఆమె నో చెప్పి బయటకు వెళ్లిపోవడం తో ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు. వీటిలో ఏది నిజం , ఏది అబద్దం అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.