Homeఎంటర్టైన్మెంట్Allu Arjun dance teacher senior actress: అల్లు అర్జున్ కి డ్యాన్స్ నేర్పించిన సీనియర్...

Allu Arjun dance teacher senior actress: అల్లు అర్జున్ కి డ్యాన్స్ నేర్పించిన సీనియర్ హీరోయిన్ ఆమెనే.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది..

Allu Arjun dance teacher senior actress: మన ఇండియా లో అద్భుతంగా డ్యాన్స్ వేసే హీరోల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని అందరూ ఆయన్ని ముద్దుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న డ్యాన్స్ ఒకప్పటి తో పోలిస్తే 10 శాతం మాత్రమే. ఆరోజుల్లో అల్లు అర్జున్ డ్యాన్స్ ని చూస్తే అసలు నిజంగా ఇతను మనిషేనా ..?, శరీరం లో ఎముకలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో డ్యాన్స్ వేసేవాడు. ఒక సందర్భం లో ఆయనకు డ్యాన్స్ చేస్తూ దెబ్బలు కూడా తగిలాయి, చెయ్యి కూడా విరిగింది. ఆ రేంజ్ కసితో డ్యాన్స్ చేసేవాడు. అలాంటి డ్యాన్సర్ కి డ్యాన్స్ నేర్పించింది ఒక సీనియర్ హీరోయిన్ అంటే నమ్ముతారా.. ?, కానీ మీరు నమ్మినా, నమ్మకపోయినా అది నిజం.

ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు, రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు సౌత్ లో లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగిన రాధికా, ప్రస్తుతం కూడా సహాయ నటిగా సినిమాలు చేస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తూ ముందుకు వెళ్తోంది. కేవలం సినిమాల్లోనే కాదు, పలు టీవీ షోస్ కి జడ్జీ గా కూడా వ్యవహరిస్తోంది. రీసెంట్ గానే జీ తెలుగు లో మొదలైన ‘ఆట’ అనే డ్యాన్స్ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ షో కి రికార్డు స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంది. అయితే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఒక అమ్మాయి అల్లు పాటకు డ్యాన్స్ వేసిన తర్వాత, రాధికా ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా, అది ఇప్పుడు సోషల్ మీడియా ల బాగా వైరల్ అయ్యింది.

Also Read: రోజుకు రోజుకు ముదురుతున్న మోనాలిసా వివాదం.. అరెస్ట్ తప్పేలా లేదుగా..

ఆమె మాట్లాడుతూ ‘గీత ఆర్ట్స్ బ్యానర్ లో నేను గతంలో ఒక సినిమా చేసాను. ఆ సినిమాలోని ఒక సన్నివేశం లో ఓ అబ్బాయిని ఎత్తుకొని రైల్వే ట్రాక్ పై పరుగులు తీస్తాను. ఆ అబ్బాయి మరెవరో కాదు , మన అల్లు అర్జున్ గారే. అలా నేను అల్లు అర్జున్ కి రైల్వే ట్రాక్ మీద పరుగులు తీస్తూ డ్యాన్స్ ఎలా వెయ్యాలో నేర్పించాను’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది రాధికా శరత్ కుమార్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని, చిన్న తనం లోనే అల్లు అర్జున్ చాలా చురుగ్గా ఉండేవాడని, భవిష్యత్తులో అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది రాధికా.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version