Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu movie working experience: మహేష్ బాబు తో సినిమా చేయడం అంత ఈజీ...

Mahesh Babu movie working experience: మహేష్ బాబు తో సినిమా చేయడం అంత ఈజీ కాదంటున్న స్టార్ డైరెక్టర్…

Mahesh Babu movie working experience: కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడం అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. దర్శకులు ఎలాంటి స్క్రిప్టు రాసుకున్నా కూడా ఆ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. లేకపోతే మాత్రం అతని అభిమానులు హీరోలను స్క్రీన్ మీద చూడలేకపోవచ్చు. దానివల్ల సినిమా మొత్తానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం డిఫరెంట్ క్యారెక్టర్ ను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి తన అభిమానులు మాత్రం అతన్ని వేరియేషన్స్ లో చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే ఆయన గత పది సంవత్సరాల నుంచి రొటీన్ టెంప్లేట్ లో ఇనుమలు చేస్తున్నాడు… నిజానికి కెరియర్ స్టార్టింగ్ లోనే నాని, టక్కరి దొంగ, నిజం లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలను చేసిన ఆయన ఆ తర్వాత ఎప్పుడు కూడా సాహసల వైపు అడుగులు వేయలేదు. కారణం ఏంటి అంటే ఆయనకి వచ్చిన ప్లాపు లు, అవి ప్రొడ్యూసర్స్ కి మిగిల్చిన నష్టాలే అందుకు నిదర్శనమని చెప్పాలి.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఒక్కసారి స్క్రిప్ట్ కి కనెక్ట్ అయితే దర్శకుడిని ఫాలో అవుతూ ఉంటాడని అందరు చెబుతుంటారు. ఇక తన ఇమేజ్ నైతే బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసే దర్శకులే కావాలి. ఒకవేళ తన ఇమేజ్ కి ఏ చిన్న రిమార్క్ వచ్చినా కూడా తన అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

Also Read: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ లెక్కలు మార్చేసిన రణ్వీర్ సింగ్…

ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని అలరించే సినిమాగా ఈ సినిమా రాబోతుంది. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను చూడడానికి ఇప్పటినుంచే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

ఇక మహేష్ బాబు అభిమానులను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. అతను ఎలాంటి పాత్రలు చేసిన కూడా తన అభిమానులు చూస్తారు కానీ తనను డిఫరెంట్ సినిమాలే చేయమని కోరుతున్నారు. ఇక ఫ్యూచర్లో ఆయన వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తాడా? లేదా అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version