https://oktelugu.com/

ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి.. హీరోయిన్ల ట్రెండ్ ఇది !

గర్భవతి అని ప్రకటించడం ఈ మధ్య హీరోయిన్లకు బాగా సరదా అయిపోయింది. దీనికితోడు పెళ్లికి ముందే గర్భవతి అవ్వడం కూడా ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల హాట్ బ్యూటీ దియా మిర్జా పద్దతిగా పెళ్లి చేసుకొంది. కానీ పెళ్లి అయిన నెలకే నేను గర్భవతిని అంటూ ఐదు నెలల కడుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో సిగ్గు పడుతూ షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంటే, మొదట గర్భం దాల్చినట్లు కన్ఫర్మ్ […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2021 / 12:55 PM IST
    Follow us on

    గర్భవతి అని ప్రకటించడం ఈ మధ్య హీరోయిన్లకు బాగా సరదా అయిపోయింది. దీనికితోడు పెళ్లికి ముందే గర్భవతి అవ్వడం కూడా ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల హాట్ బ్యూటీ దియా మిర్జా పద్దతిగా పెళ్లి చేసుకొంది. కానీ పెళ్లి అయిన నెలకే నేను గర్భవతిని అంటూ ఐదు నెలల కడుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో సిగ్గు పడుతూ షేర్ చేసింది.

    దాంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంటే, మొదట గర్భం దాల్చినట్లు కన్ఫర్మ్ చేసుకుని, ఆ తర్వాత ఆమె హడావిడిగా పెళ్లి చేసుకొంది అన్నమాట. ఈ విషయంలో ఆ మధ్య దియా పై నెగిటివ్ కామెంట్ల వర్షం కురిసింది. కానీ, దియా మిర్జా మాత్రం వాటి పై స్పదించలేదు. కానీ, ఇంత చిన్న విషయానికి ఎందుకు నెటిజన్లు అంత సీరియస్ అవుతారో తనకు అర్ధం కాదు అంటూ సన్నిహితుల దగ్గర తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది దియా.

    సరే దియా మ్యాటర్ ను జీర్ణించుకునే లోపే ఇప్పుడు మరో హీరోయిన్ మళ్ళీ నెటిజన్ల తిట్లకు పని చెప్పింది. ‘సాహో’ సినిమాలో నటించిన ఎవెలిన్ శర్మ గుర్తుందా ? గత నెలలో తన ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ ని గ్రాండ్ పెళ్లాడి… కొన్ని రోజులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది కదా. అయితే, ఈ భారీ బ్యూటీ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడం ఆగకముందే, తన గర్భవతి ఫోటోలను వదిలింది.

    పైగా తాను గర్భవతిని అని గర్వంగా సగర్వంగా ప్రకటించింది ఎవెలిన్ శర్మ. ఇలా పెళ్లి అయిన నెలకే ఈ ముదురు భామకు నాలుగు నెలల కడుపు ఎలా వచ్చింది అంటూ కొంతమంది జనాలు అమాయకంగా కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత హడావిడిగా పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ భామలకు ఆనవాయితీ అయిపోయింది.