ఈ సినిమా పట్ల సౌత్ ప్రేక్షకుల స్పందన చూసి అమెజాన్ సంస్థే సర్ ప్రైజ్ అయింది. ఈ సినిమా కి వస్తోన్న వ్యూహర్షిప్ అదిరిపోయింది అంటూ ఆ మధ్య ఈ సినిమా టీమ్ కి ప్రత్యేక గిఫ్ట్ లు కూడా అమెజాన్ అందించింది. ఈ సినిమా ఇంత గొప్ప హిట్ అయింది కాబట్టే.. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు సూర్య.
సూర్య, జీవితతో మరియు రాజశేఖర్ పాండియన్ తో కలిసి ఈ సినిమాని హిందీలో భారీ స్థాయిలో రీమేక్ చేస్తోన్నాడు. అయితే హిందీ వెర్షన్ లో హీరో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదట. హీరో ఫిక్స్ కాకపోయినా.. దర్శకురాలు మాత్రం సుధ కొంగరనే. ఏది ఏమైనా ఇటీవల తెలుగు, తమిళ్ సినిమాలను హిందీలో సౌత్ డైరెక్టర్లతో రీమేక్ చేయడం ట్రెండ్ గా మారింది.
సో.. ఆ ట్రెండ్ ను ఇప్పుడు సుధ కొంగర కూడా కొనసాగిస్తోంది అన్నమాట. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ సినిమాని సందీప్ వంగ హిందీలో ‘కబీర్ సింగ్’గా తీసి మొత్తానికి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎనలేని గుర్తింపును పొందాడు. ఆలాగే ‘జెర్సీ’ సినిమాని హిందీలో గౌతమ్ తిన్ననూరి తీస్తున్న సంగతి తెలిసిందే.