Salaar Movie: దర్శక ధీరుడు రాజమౌలు తెరకెక్కించిన ” బాహుబలి ” భారీ విజయం తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న వన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రస్తుతం ప్రభాస్… ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘సలార్’. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ మూవీ నుంచి ప్రభాస్ యాక్షన్ సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టు గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలు సైతం వేరే భాష చిత్రాల్లో విలన్‌గా నటించడానికి సై అంటున్నారు. ఈ కోవలోనే సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ లో, మలయాళీ స్టార్ ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు. ఈ తరుణంలో ‘సలార్’ మూవీలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో విరల్ గా మారింది. దీంతో టాలీవుడ్, మాలీవుడ్‌ల్లో స్టార్స్‌గా వెలుగొందుతున్న వీరిద్దరూ… స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని వారి అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.
ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే … మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో పాటు… రాధా కృష్ణ దర్శకత్వంలో “ రాధే శ్యామ్ ” లో కూడా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 నా విడుదల కానుంది. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.