Samantha: సమంత – అక్కినేని నాగచైతన్య విడాకుల గురించి ప్రకటించిన తర్వాత నుంచి ఈ వార్తాలే న్యూస్ లో హాట్ టాపిక్ గా నిలిస్తున్నాయి. వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత ఇటీవల అనూహ్యంగా తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి … అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వారికి సైతం షాకిచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అని తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే తాము విడిపోవడానికి గల కారణాలు సమంత కానీ, చైతన్య కానీ ఇప్పటి వరకు చెప్పలేదు.

ఇక నెట్టింట్లో వారు విడిపోవడానికి ఇదే కారణం అంటూ… ఎవరికి నచ్చినట్లుగా వారు వార్తలు రాశారు. అలానే సామ్ – చైతూ విడిపోవడానికి సమంతనే కారణం అంటూ ఆమె పై కధనాలు కూడా వచ్చాయి. వీటిపై స్పందిస్తూ సోషల్ మీడియా లో సామ్ పలు పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందరిని షాక్ కి గురిచేస్తూ సమంత ఒక నిర్ణయం తీసుకుంది.
తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా తనపై కధనాలు ప్రచురించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లి కోర్టులో… సమంత పరువు నష్టం దావా వేశారు. నాగచైతన్య తో విడాకులు అనంతరం వారిద్దరిపై రకరకాల కథనాలు వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసార మయ్యాయి. ఈ మేరకు సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పై… సామ్ పిల్ దాఖలు చేశారు. సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు.