Mokshagna Teja: నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించిన ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిద్య భరితమైన కథాంశాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ప్రస్తుతం తన కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి అనే ధోరణిలో కొంతవరకు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రెబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు…
ఆయన తమ్ముడి కొడుకు అయిన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా అవతరించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈశ్వర్ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించాడు… ఇక ఆయన బాటలోనే ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా నడువబోతున్నట్టుగా తెలుస్తోంది.
మొదటి సినిమాతోనే మాస్ ను చేయాలని ఉద్దేశంతో ఆయన మాస్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా ఆయన డ్యాన్స్ ల్లో గానీ, ఫైట్ లలో గాని ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఎలాంటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మోక్షజ్ఞ కూడా అలాంటి క్రేజ్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రశాంత్ వర్మ తో సినిమా ఉంటుందని మొదట్లో వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన ఇప్పుడు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మాస్ డైరెక్టర్ ను ఈ సినిమా కోసం ఎంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఎవరు అనేది ఎవ్వరికి తెలియకుండా సస్పెన్స్ గా ఉంచుతున్నారు…