OG Movie Day 10 Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) బాక్స్ ఆఫీస్ వేట ఇంకా పూర్తి అవ్వలేదు. గత పది రోజుల నుండి స్టడీ కలెక్షన్స్ తో ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తూ ముందుకు వెళ్తూనే ఉంది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటున్న చిత్రమిదే. నేడు అయితే ఈ సినిమా అనేక ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం విడుదలైన ‘కాంతారా 2’ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా వైజాగ్ వంటి ప్రాంతాల్లో అయితే కాంతారా 2 చిత్రం కంటే ‘ఓజీ’ సినిమాకే ఎక్కువగా హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. 10 రోజుల క్రితం విడుదలైన ఒక సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో రన్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఓజీ విషయం లో అదే జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రన్ పట్ల మామూలు ఆనందంలో లేరు.
ఇకపోతే పది రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబట్టింది?, పదవ రోజున ఏ రేంజ్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా చూస్తే ఈ చిత్రం పదవ రోజున 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, చెన్నై మరియు నార్త్ ఇండియా తో పాటు, ఓవర్సీస్ లో కూడా వసూళ్లు బాగా పెరిగాయి. ఫలితంగా ఈ చిత్రం పదవ రోజున 4 నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో షేర్ వసూళ్లను రాబట్టి ఉంటుందని అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే పదవ రోజున 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం ప్రాంతానికి సంబంధించిన వసూళ్లు మధ్యలో ఒక రెండు రోజులు బాగా డౌన్ అయ్యాయి కానీ, దసరా తర్వాత భారీగా వసూళ్లు పుంజుకున్నాయి.
ఫలితంగా నిన్నటితో ఈ చిత్రం నైజాం ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తి చేసుకుంది. సీడెడ్ ప్రాంతం కూడా దసరా తర్వాత మంచి గ్రోత్ ని చూపించుకుంది. పదవ రోజున నైజాం ప్రాంతం లో ఈ చిత్రం కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే, సీడెడ్ ప్రాంతం నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా నెల్లూరు జిల్లా నుండి 10 లక్షలు, గోదావరి జిల్లాల నుండి పాతిక లక్షలు, కృష్ణ జిల్లా నుండి 12 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 10 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం విషయానికి వస్తే, దాదాపుగా సీడెడ్ తో సమానంగా వసూళ్లు వచ్చాయని, 70 లక్షల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ఓవరాల్ గా 172 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు 280 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.