Mokshagna Teja: నందమూరి తారక రామారావు’ గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు(Balayya Babu) స్టార్ హీరో ఇమేజ్ తో ముందుకు సాగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక అతని తర్వాత నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshgna) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి బాలయ్య బాబు తన వారసుడిగా మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి తన అనుకున్నట్టుగానే మోక్షజ్ఞ స్టార్ హీరోగా కొనసాగుతాడా? ఎన్టీఆర్ లాంటి నటుడిని పక్కన పెట్టి అతను స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ మధ్య రాబోయే రోజుల్లో భీకరమైన పోటీ అయితే నడవబోతుంది. ఇక కొంతమంది మాత్రం మోక్షజ్ఞ స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయలేడు. కాబట్టి నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటుంటే మరి కొంతమంది మాత్రం మోక్షజ్ఞ చాలా పెద్ద హీరో అవుతాడు. నందమూరి ఫ్యామిలీని తను దగ్గరుండి మరి ముందుకు తీసుకెళ్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అప్పట్లో పవన్ టైటిల్ తో ఉదయ్ కిరణ్ సినిమా..ఇండస్ట్రీ హిట్ చేజారిపోయింది!
ఇప్పుడు నందమూరి నట వారసుడు ఎవరు అనే దాని మీదనే అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటివరకైతే నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతానికి అతన్ని బీట్ చేసే దమ్ము అయితే ఎవరికీ లేదు.
చూడాలి మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఎంట్రీ ఇస్తే గాని అతనిలోని కెపబులిటీ ఏ విధంగా ఉంది. ఆయన ఎంత వరకు రాణించబోతున్నాడు తద్వారా నందమూరి ఫ్యాన్స్ అతన్ని ఏ విధంగా ఆదరిస్తారు అనేదాన్ని బట్టి అతను స్టార్ హీరో అవుతాడా? లేదా అనేది డిసైడ్ చేస్తారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే దాని మీదనే ఇప్పుడు చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి…ఒకవేళ ఈ ఇయర్ మోక్షజ్ఞ సినిమా వస్తే అటు నందమూరి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు ఒక రకం గా పండగనే చెప్పాలి…