Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న ఆయన తర్వాత చేసిన ప్రతి సినిమాతో భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఇక హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ వసూళ్లను సాధిస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాయి. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేయబోతున్న సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగ అంటే బోల్డ్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి దర్శకుడు చేయబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది. తద్వారా ఆయన చేయాలనుకుంటున్న సినిమా ఏ విధమైన రెస్పాన్స్ ను మూటగట్టుకుంటుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: మోక్షజ్ఞ ఎన్టీఆర్ ను బీట్ చేస్తాడా.?స్టార్ హీరో అవుతాడా..?
ఇక ఈ సినిమాలో సంచలన దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఆర్జీవి (RGV) కూడా ఒక చిన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి (Kalki) సినిమాలో ఆర్జీవి ఒక చిన్న పాత్రలో నటించాడు. అయితే సందీప్ రెడ్డి వంగ మీద ఉన్న అభిమానంతో ఆర్జీవి ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
ఇక ఆర్జీవి కనక ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం లో ఈ సినిమాకి ఒక మంచి బజ్ అయితే వస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ప్రభాస్ చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తే సొసైటీ ఎలా ఉంటుంది అనే పాయింట్ మీదనే ఈ సినిమాను చేసినట్టుగా తెలుస్తోం… మరి ప్రభాస్ లాంటి నటుడు చాలా ఆచితూచి మరి సినిమాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…