Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు సినిమాలను చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. మాస్ సినిమాలను చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలతో టాప్ లెవల్ కి వెళ్ళాడు. ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి తన కొడుకు అయిన మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. దాదాపు 30 సంవత్సరాలకు చేరువలో ఉన్న మోక్షజ్ఞ ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి తన సత్తా చాటుతాడు. తన తోటి హీరోలందరు స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే తను మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీకి రావడానికి సందేహిస్తున్నాడు. దీనివల్ల నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నాడు.
ఇక తన తో పాటు స్టార్ హీరో రేంజ్ ను అందుకొని టాప్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ కోసం ఒక యంగ్ డైరెక్టర్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరు అంటే నానితో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేసిన వివేక్ ఆత్రేయ కావడం విశేషం…
ఈ దర్శకుడు రీసెంట్ గా బాలయ్య బాబు కి ఒక కథనైతే వినిపించాడు. ఆ కథను లాక్ చేసిన బాలయ్య తను కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యేలోపు తన కొడుకు అయిన మోక్షజ్ఞతో సినిమా చేయమని వివేక్ ఆత్రేయ కి చెప్పారట. తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించే అవకాశాలు ఉన్నాయి… మొత్తానికైతే ఇది కనక వర్కౌట్ అయితే వివేక్ ఆత్రేయ మోక్షజ్ఞ ను డిఫరెంట్ గా చూపిస్తాడు… ఇక నిజంగానే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? దీని నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు రాబోతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు అలాగే టిడిపి కార్యకర్తలు సైతం ఆసక్తి ఎదురుచూస్తున్నారు…
