Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Release Date: 'పెద్ది' మూవీ వాయిదా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.....

Peddi Movie Release Date: ‘పెద్ది’ మూవీ వాయిదా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

Peddi Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఈ నెల 30 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా , అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ నేపథ్యం లో గత కొద్దిరోజుల నుండి ee సినిమా వాయిదా పడిందని, జూన్ 25 న వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి […]

Peddi Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఈ నెల 30 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా , అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ నేపథ్యం లో గత కొద్దిరోజుల నుండి ee సినిమా వాయిదా పడిందని, జూన్ 25 న వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఈ విషయం తెలుసుకొని తీవ్రమైన నిరాశకు గురయ్యారు. రామ్ చరణ్ సినిమాకు చాలా కాలం తర్వాత మంచి బజ్ వచ్చింది, ఇలాంటి సమయం లో ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడింది అంటున్నారు, సెన్సేషనల్ ఓపెనింగ్స్ అవ్వబోతున్నాయి అంటూ అభిమానులు చాలా కంగారు పడ్డారు. అయితే అభిమానులు పడుతున్న ఆ కంగారుకి చెక్ పెట్టాడు రామ్ చరణ్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Also Read: చిరంజీవి సోలోగా హిట్టు కొట్టలేడా… ఇప్పుడు ఇద్దరు హీరోలను సెట్ చేశాడు…

పూర్తి వివరాల్లోకి వెళ్తే , మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన ‘రాకాస’ మూవీ రేపు ప్రీమియర్స్ షోస్ తో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తమ చిత్రానికి ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక కొణిదెల అందులో హీరో హీరోయిన్లు గా నటించిన సంగీత్ శోభన్, నిహారిక కొణిదెల తో కలిసి ‘పెద్ది’ మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్ళింది. రామ్ చరణ్ వీళ్ళం సాధారణంగా ఆహ్వానించి, ‘రాకాస’ మూవీ విశేషాల గురించి మాట్లాడాడు. చివర్లో ‘పెద్ది సినిమా ఆలస్యం అవ్వడం లేదమ్మా, కాస్త ప్రమోట్ చెయ్యండి, సినిమా గురించి సోషల్ మీడియా లో చాలా గాసిప్స్ చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. స్వయంగా హీరోనే ఈ రేంజ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఇక పోస్ట్ పోన్ రూమర్స్ ని నమ్మాల్సిన అవసరం లేదని, కుంభస్థలం బద్దలయ్యే రేంజ్ హిట్ కొట్టబోతున్నామని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొంతమంది అయితే ఈరోజు ఏప్రిల్ 1, అంటే ఫూల్స్ డే, రామ్ చరణ్ అన్న సరదాగా మన అందరినీ ఫూల్స్ చేయడం లేదు కదా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే , మూవీ టీం మాత్రం ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని తీసుకొని వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అనుకున్న సమయానికి సినిమా వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ రాకపోతే మాత్రం రామ్ చరణ్ తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుంది మరో పక్క ఈ సినిమా విడుదలయ్యే రోజునే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరో గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper