Mokshagna : నందమూరి వంశంలో మూడో తరానికి చెందిన మోక్షజ్ఞ హీరో కావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. సాధారణంగా టీనేజ్ ముగియగానే వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. పాతికేళ్ళు వచ్చే నాటికి ఓ ఇమేజ్ రాబడతారు. మోక్షజ్ఞ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ మీసం మొలవక ముందే హీరో అయ్యాడు. టీనేజ్ లోనే మాస్ హీరో ఇమేజ్ తో స్టార్ హోదా రాబట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. మరోవైపు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఇంకా ఎంట్రీనే ఇవ్వలేదు. గత ఏడాది చివర్లో మోక్షజ్ఞ మూవీ పట్టాలెక్కాల్సి ఉంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఖరారు అయ్యింది. స్లిమ్ అండ్ హ్యాండ్ సమ్ గా ఉన్న మోక్షజ్ఞ లుక్ కూడా విడుదల చేశారు. అయితే షూటింగ్ మొదలు కాక ముందే మూవీ ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగాడని, తాను కాకుండా తన అసిస్టెంట్స్ డైరెక్ట్ చేస్తారనే కండిషన్స్ పెట్టాడనే పుకార్లు వినిపించాయి. కారణం ఏదైనా కానీ మూవీ అయితే ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ పక్కన పెట్టి ప్రభాస్ తో మూవీని సెట్ చేసుకున్నాడని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : మోక్షజ్ఞ ను లాంచ్ చేసేది ‘కల్కి’ మూవీ డైరెక్టరేనా..? ప్రశాంత్ వర్మ చేసే సినిమా రెండో మూవీగా రాబోతుందా..?
ప్రశాంత్ వర్మ చేయకుంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యత ఎవరిది? ఏ దర్శకుడితో చేయనున్నాడు? అనే చర్చ మొదలైంది. అసలు మోక్షజ్ఞకు హీరో అయ్యే యోగం ఉందా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సందేహాల నడుమ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. నందమూరి బాలకృష్ణ ఢిల్లీ వేదికగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఈ విశిష్ట వేడుకలో పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ గ్రూప్ ఫోటో దిగాడు. సదరు ఫోటోలో మోక్షజ్ఞ లుక్ ఏమంత ఆకర్షణీయంగా లేదు. మరలా ఆయన షేప్ అవుట్ అయ్యారనే భావన కలుగుతుంది. మోక్షజ్ఞ పొట్టతో కనిపించాడు. మోక్షజ్ఞ గతంలో ఎలాంటి ఫిట్నెస్ మైంటైన్ చేసేవాడు కాదు. హీరో కావాలని ఆయన స్లిమ్ అండ్ ఫిట్ గా తయారయ్యాడు. మూవీ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో మోక్షజ్ఞ మరలా ఫిట్నెస్ వదిలేశాడనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో మోక్షజ్ఞ కథ మళ్ళీ మొదటికి వచ్చిందనే వాదన మొదలైంది.
Also Read : మోక్షజ్ఞ సినిమా మరింత లేట్ కానుందా..? అసలు ఎందుకిలా జరుగుతుంది…