Mokshagna Sudden Twist : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా, అక్కినేని ఫ్యామిలీ నుంచి తమ నట వారసులు ఇండస్ట్రీకి వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలు వచ్చినప్పటికి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు…
నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు (Balayya Babu) ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన నాలుగు సినిమాలు వరుస సక్సెస్ లను సాధించడంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఏర్పడింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను అలరించిన సినిమాలే కావడం విశేషం. ఇక ఇప్పుడు ఆయన నట వారసుడు అయిన మోక్షజ్ఞ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీద కైతే వెళ్లలేదు.
Also Read : మోక్షజ్ఞ ను లాంచ్ చేసేది ‘కల్కి’ మూవీ డైరెక్టరేనా..? ప్రశాంత్ వర్మ చేసే సినిమా రెండో మూవీగా రాబోతుందా..?
ఇక ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమా మీద కొంతవరకు ఆసక్తి చూపించడం లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికి అసలు మోక్షజ్ఞ కి ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ కూడా లేదని బలవంతంగా ఇండస్ట్రీకి రప్పిస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు.
మరి వీటిలో ఏది నిజం మోక్షజ్ఞ (Mokshagna) ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందా? ఉండదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మరి ఈ సంవత్సరం ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోవచ్చు అని మరి కొంతమంది చెబుతున్నారు. ఒకవేళ అతన్ని బలవంతంగా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఆయన ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే పెద్దగా సినిమాలను చేసి సూపర్ స్టార్ గా ఎదిగే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
ఆయనకు బిజినెస్ లు చూసుకోవడం అంటే ఇష్టమని బిజినెస్ లు చూసుకోవడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని బాలయ్య బాబుకి ఉన్నప్పటికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విశేషం…