Nandamuri Mokshagna First Movie
Nandamuri Mokshagna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక అలాంటి బాలయ్య బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా మోక్షజ్ఞ (Mokshagna) ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఒక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని చూస్తున్నాడు…ఇక ఇప్పటికే ఈయనను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ను సెట్ చేసిన బాలయ్య బాబు ఆయన నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో మరొక డైరెక్టర్ ని రంగం లోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా వస్తుంది కానీ అది మొదటి సినిమాగా కాకుండా రెండవ సినిమాగా రాబోతుందట. మరి మొదటి సినిమాని ఎవరితో చేయిస్తున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక మొదటి సినిమాను నాగ్ అశ్విన్ తో చేయించి ప్రశాంత్ వర్మ తో రెండోవ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట… ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ (jai Hanuman) సినిమాను అలాగే మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
కాబట్టి మొదటి సినిమాను ‘కల్కి ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయించడమే ఉత్తమమని బాలయ్య బాబుతో పాటు తమ సన్నిహితులు కూడా భావిస్తున్నారట. మరి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే ఈ సినిమాతో మోక్షజ్ఞ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సదించబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ వర్మ వచ్చిన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నాడనే చెప్పాలి.
ఆయన ఒకే టైమ్ లో కొన్ని సినిమాలకు కథలు అందిస్తూ, మరికొన్ని సినిమాలను మల్టీ యూనివర్స్ పేరుతో తెరకెక్కించాలని చూస్తున్నాడు. కాబట్టి సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడంతో బాలయ్య బాబు తీవ్రమైన కోపానికి వచ్చాడట. అందువల్లే తన సినిమాని క్యాన్సిల్ చేయకుండా రెండో సినిమాగా చేయాలని మొదటి సినిమాను వేరే దర్శకుడు తో చేయిస్తానని బాలయ్య బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే లేకుండా పోతుందనే చెప్పాలి…