Inter 1st Year Results: తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మొదట్లో విద్యార్థులను ప్రమోట్ చేసి తరువాత పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గతేడాది 60 శాతం ఉన్న ఉత్తీర్ణతా శాతం ఈ సంవత్సరం 49 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ నిర్వాకంపై అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వాపోతున్నారు. ఇంత తక్కువ సమయంలో పరీక్షలు పెట్టి తెలివైన విద్యార్థులను కూడా ఫెయిలయ్యేలా చేసిన ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులను పరీక్షలు రాసేలా చేసిన ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు సంకల్పించిందో అర్థం కావడం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
Also Read: CM KCR: పదవుల పందేరం చేసిన కేసీఆర్.. ఎవరెవరికి ఏ పోస్టు అంటే?
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్ కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం వారి జీవితాలను పణంగా పెడుతోందని విమర్శిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు పరీక్షల నిర్వహణపై ఎందుకు సుముఖత వ్యక్తం చేశారంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా పరీక్షలను రద్దు చేసి గతంలో పాటించిన విధానంలో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.
Also Read: Bhadradi Kothagudem: గతి తప్పిన టీచర్లు.. గురుకులంలో ఏకాంతంగా ఇద్దరు ఉపాధ్యాయులు