నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో హీరో తెరపై కనిపించబోతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. న్యూయర్క్ లోని స్టార్స్ బర్గ్ ఫీలిం ఇన్టిట్యూట్లో యాక్టింగ్ కు సంబంధించి ఒక కోర్సు చేస్తున్నాడని తెల్సింది. ఈ శిక్షణ పూర్తవగానే మోక్షజ్ఞ సిమాల్లో […]

Written By: Neelambaram, Updated On : February 13, 2020 5:29 pm
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో హీరో తెరపై కనిపించబోతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. న్యూయర్క్ లోని స్టార్స్ బర్గ్ ఫీలిం ఇన్టిట్యూట్లో యాక్టింగ్ కు సంబంధించి ఒక కోర్సు చేస్తున్నాడని తెల్సింది. ఈ శిక్షణ పూర్తవగానే మోక్షజ్ఞ సిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ హీరోయిజం ఉన్న నటుడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఎందరో ఉన్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి డజనుపైగా హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అలాగే నాగార్జున కుమారుడు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు.

అయితే బాలకృష్ణ కుమారుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో నందమూరి అభిమానులు కూడా ఆయన ఎంట్రీపై ఆశలు వదులుకున్నారు. తాజాగా మోక్షజ్ఞ నటనలో శిక్షణలో తీసుకుంటున్నారనే వార్త తెలియడంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే నటనలో ఇంట్రెస్ట్ లేని మోక్షజ్ఞ సినిమాల్లో ఎంతవరకు రాణిస్తారనేది భవిష్యత్లో తేలనుంది. ఏదిఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి అభిమానులకు శుభవార్తే అని చెప్పొచ్చు.