Homeఎంటర్టైన్మెంట్‘చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తీకేయ

‘చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తీకేయ

‘ఆర్ఎక్స్-100’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన హీరో కార్తీకేయ. పక్కంటి కుర్రోడిలా కన్పించే కార్తీకేయ ‘ఆర్ఎక్స్-100’ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీ హిట్టుతో కార్తీకేయ సినిమా ఆఫర్లు భారీ వచ్చాయి. ఇటీవల కార్తీకేయ చేసిన సినిమాలు ‘గుణ-369’, ‘90ఎంఎల్’ సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. దీంతో కథల ఎంపికలో ఆచితుచి వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘చావుకబురు చల్లగా’ అనే మూవీకి కార్తీకేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘చావుకబురు చల్లగా’ మూవీ గురువారం ప్రారంభమైంది. ఈమేరకు ఈ మూవీ ఫస్టు లుక్ ను సినిమా బృందం విడుదల చేసింది. కార్తకేయ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. గల్లా చొక్కా, గల్లా లుంగీతో ఏపీ వాహనంపై స్టైల్ గా స్మోక్ చేస్తున్న కార్తీకేయ స్టీల్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కార్తీకేయ బాలరాజుగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్టు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నేటి నుంచి ‘చావుకబురు చల్లగా’ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీలో కార్తీకేయ జోడిగా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. తొలిసారి కార్తీకేయ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తీకేయకు ఈ మూవీ తీపి కబురు పంచుతుందా? లేక చావుకబురు మిగులుస్తుందా? అనేది త్వరలోనే వెల్లడికానుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version