Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi request rejected by Mohanlal: చిరంజీవి రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన మోహన్ లాల్.....

Chiranjeevi request rejected by Mohanlal: చిరంజీవి రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన మోహన్ లాల్.. చివరి నిమిషంలో మామూలు ట్విస్ట్ ఇవ్వలేదుగా..

Chiranjeevi request rejected by Mohanlal: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) , డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ గ్యాప్ లో డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ ని మరింత మెరుగుపరిచాడు. ఈ చిత్రానికి ‘నానాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘గాడ్ ఫాదర్’ తరహా క్యారెక్టరైజేషన్ , తండ్రి కూతురు ఎమోషన్ తో నడిచే సినిమా , గ్యాంగ్ స్టర్ స్టోరీ , ఇలా జెన్ జీ ఆడియన్స్ కి తగ్గట్టుగా ఈ సినిమా స్క్రిప్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్ బాబీ. తారాగణం కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఈ చిత్రం లో మోహన్ లాల్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఇప్పుడు మోహన్ లాల్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం డేట్స్. ఆయన ఇచ్చిన డేట్స్ ప్రకారం ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాలి. కానీ KVN ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ‘జన నాయగన్ ‘ కారణంగా ఆర్ధిక సంక్షోభం లో మునిగిపోవడం తో , ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీంతో మోహన్ లాల్ ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. వచ్చే నెల నుండి ఆయన వేరే మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఆరు నెలల వరకు ఆయన దొరికే అవకాశం లేదు. ఈ కారణం చేత మోహన్ లాల్ తప్పుకోవడం తో , ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ని ఆయన స్థానంలోకి తీసుకున్నారని టాక్.

అనిల్ కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ చిత్రాన్ని బాలీవుడ్ లో అనిల్ కపూర్ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అదే విధంగా ‘ఒకే ఒక్కడు’ చిత్రాన్ని అక్కడ ఆయన ‘నాయక్’ పేరుతో రీమేక్ చేశాడు . 2000 దశకం వరకు సూపర్ స్టార్ గా కొనసాగిన ఆయన, ఆ తర్వాత తన స్టార్ స్టేటస్ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అలా మెగాస్టార్ సినిమాలో కూడా చేయబోతున్నాడు. అయితే మోహన్ లాల్ ఇప్పటికీ సూపర్ స్టార్ స్టేటస్ తోనే కొనసాగుతున్నాడు , ఆయన సినిమాలు హిట్ అయితే అవలీల గా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేస్తున్నాయి, అలాంటి సూపర్ స్టార్ మెగాస్టార్ తో చేతులు కలిపితే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అయ్యేవి, అనిల్ కపూర్ వల్ల అసలు ఉపయోగం ఉండదు అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular