Dhurandhar The Revenge 32 days collections: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సెన్సేషనల్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2: The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 32 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఓపెనింగ్స్ వసూళ్లు ఒక సునామీ అనే చెప్పొచ్చు. మొదటి 11 రోజులు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లను చూసి , ట్రేడ్ కచ్చితంగా 2500 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అనుకున్నారు. కానీ IPL సీజన్ మొదలు అవ్వడం వల్లనో , లేదంటే కేవలం బీజేపీ ఎజెండా తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అనే దుష్ప్రచారం వల్లనో తెలియదు కానీ, వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి. డౌన్ అయ్యినప్పటికీ కూడా స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తూ ఇంత దూరం వచ్చింది ఈ చిత్రం. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 3 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఇలాంటి సెన్సేషనల్ లాంగ్ రన్ ని భవిష్యత్తులో మనం ఏ సినిమాకు కూడా చూడలేం ఏమో. ఇకపోతే రీసెంట్ గానే ‘పుష్ప 2’ రికార్డుని కొల్లగొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు ‘బాహుబలి 2’ సాధించిన 1840 కోట్ల గ్రాస్ ని దాటుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు అసాధ్యం అంటున్నారు , మరికొంత మంది మాత్రం కచ్చితంగా బాహుబలి 2 ని దాటుతుందని అంటున్నారు. గడిచిన వారం రోజుల్లో ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ 32 రోజుల్లో ఎంత గ్రాస్ వచ్చిందో వివరంగా చూద్దాం. ఓవర్సీస్ కాకుండా, కేవలం ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందో చూద్దాం. మొదటి వారంలో ఏకంగా 690 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా 2 వ వారంలో 271 కోట్లు , ౩వ వారంలో 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక 23 వ రోజు నుండి 32 వ రోజు వరకు ఈ చిత్రానికి 71 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా 32 రోజుల్లో ఈ చిత్రానికి కేవలం ఇండియా నుండి 1153 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక గ్రాస్ వసూళ్లు అయితే 1360 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. అదే విధంగా ఓవర్సీస్ నుండి అదనంగా మరో 423 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవరాల్ గా ఈ చిటరానికి 1783 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. బాహుబలి 2 ని అందుకోవడానికి మరో 57 కోట్ల రూపాయిల గ్రాస్ రావాలి , చూడాలి మరి అంత దూరం వెళ్తుందా లేదా అనేది.