Superstar Krishna Political Career : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna). ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. టాలీవుడ్ లో తొలి 70 MM సినిమాని పరిచయం చేసింది ఆయనే. ఇలా టెక్నికల్ గా మన తెలుగు సినిమా స్థాయిని సికరాగ్ర స్థాయికి తీసుకొని వెళ్లడం లో కృష్ణ పాత్ర సాధారణమైనది కాదు. అంతే కాదు నిర్మాతల పాలిట ఆయన దేవుడు అని అప్పట్లో అందరూ అంటుండేవారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతని పిలిచి మరో సినిమా అవకాశం ఇప్పించేవాడు. పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆ నిర్మాతకు సినిమా చేసి పెట్టేవాడు. నా దగ్గర నిర్మించడానికి డబ్బులు లేవంటే ఫైనాన్షియర్స్ తో స్వయంగా మాట్లాడి డబ్బులు ఇప్పించేవాడు. అలా సినీ కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు గడిచిపోతాయి.
Also Read : మోహన్ లాల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు ఆయన సినిమాలో హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?
ఒక నెలలో కృష్ణ హీరో గా నటించిన సినిమాలు 30 కి పైగానే ఆరోజుల్లో విడుదల అయ్యేవి అంటే నమ్ముతారా?, కేవలం విడుదల అవ్వడమే కాదు, అవి సంచలన విజయాలుగా కూడా నమోదు అయ్యేవి. అలా ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చేయనన్ని సాహసాలు చేసి మన తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కృష్ణ, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసాడు. మొదటి నుండి కృష్ణ కాంగ్రెస్ పార్టీ అధినేత రాజీవ్ గాంధీకి వీరాభిమాని. ఆయన ప్రోత్సాహంతోనే 1984 వ సంవత్సరం లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసాడు. అప్పట్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కి చరిష్మా ని తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. అప్పట్లో అధికారం లో ఉన్న తెలుగు దేశం పార్టీ పై సూపర్ స్టార్ కృష్ణ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి.
ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కృష్ణ ని పోటీ చేయమని ఒత్తిడి చేసింది. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు, కేవలం మద్దతు ప్రకటించి, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారాలు చేసేవాడు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక తెలుగు దేశం అధికారం లోకి వచ్చిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ప్రభుత్వం లో జరుగుతున్నా అన్యాయాలను నిలదీసేవాడు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు కూడా చేశాడు. అలా సూపర్ స్టార్ కృష్ణ తిరుగుబాటు కారణంగా 1989 టీడీపీ పార్టీ ఓటమిని చవిచూసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి వచ్చిందని అత్యధిక శాతం మంది నమ్మేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే కృష్ణ ని ముఖ్యమంత్రి చేస్తారని అంత అనుకునేవారు. కానీ రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకోవడం తో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని అప్పట్లో అందరు అంటూ ఉండేవారు.