Vijay Deverakonda Tamannaah Coffee Shop Viral Video : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ అవి కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చవు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), తమన్నా(Tamannah Bhatia) కాంబినేషన్. ఇద్దరు వయస్సు దాదాపుగా ఒక్కటే. విజయ్ దేవరకొండ తమన్నా కంటే ఒక సంవత్సరం పెద్దావాడు. ఇద్దరి స్కిన్ టోన్ మెరిసిపోతూ ఉంటాయి. స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ కనిపిస్తే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవేమో. తమన్నా కి కూడా విజయ్ దేవరకొండ తో నటించడానికి సిద్ధం గా ఉంటుంది. సాధారణంగా లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి పెద్దగా ఇష్టం చూపించని తమన్నా, విజయ్ దేవరకొండ కి మాత్రం అలాంటి నిబంధనలు లేవని చెప్పుకొచ్చింది. అతను ఒప్పుకుంటే లిప్ కిస్ పెట్టేస్తాను అంటూ సమంత షో లో తమన్నా మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది.
Also Read : రికార్డు స్థాయిలో ‘హరి హర వీరమల్లు’ థియేట్రికల్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
అయితే వీళ్లిద్దరు వెండితెర మీద కనిపించి ఉండకపోయుండొచ్చు కానీ, ఒక కమర్షియల్ యాడ్ లో మాత్రం కలిసి నటించారు. విజయ్ దేవరకొండ ఇంకా సిల్వర్ స్క్రీన్ పై కనపడని రోజులవి. సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని కమర్షియల్ యాడ్ వీడియోస్ లో కనిపించాడు. అందులో ఇది కూడా ఒకటి. తమన్నా గతం లో సెల్కాన్ మొబైల్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేది. ఆ సంస్థకు చెందిన ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో ఆమె నటించింది కూడా. ఒక యాడ్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఆ యాడ్ లో విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కూర్చొని ఈ ఒక సినిమాకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేస్తూ ఉంటాడు. అప్పుడే తమన్నా అక్కడికి వస్తుంది. ‘హేయ్..నా కొత్త సెల్కాన్ మొబైల్ చూడండి’ అని అంటుంది.
కానీ తమన్నా ని ఎవ్వరూ పట్టించుకోరు, సినిమాకు అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేస్తూ ఉంటారు. అప్పుడు విజయ్ దేవరకొండ ‘ఒక్క సినిమాకు అందరం కలిసి వెళ్తే 3000 వేల రూపాయిలు ఖర్చు అవుతుందా’ అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు తమన్నా ’40 సినిమాలు..2000 కంటే తక్కువ’ అని అంటుంది. 40 సినిమాలు వరకు ఉన్నటువంటి 2GB మెమరీ కార్డు గల సెల్కాన్ మొబైల్ ని కేవలం 1990 రూపాయలకే కొనుగోలు చేయండి అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఇందులో తమన్నా చాలా యంగ్ గా, క్యూట్ గా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ అయితే టీనేజ్ లో ఉన్నాడని ఆయన లుక్స్ ని చూస్తే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది, భవిష్యత్తులో కలిసి సినిమా చేయండి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram