Manchu Vishnu Accident: మంచు విష్ణు కన్నప్ప పేరుతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైంది. షూటింగ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ఇండియా నుండే భారీగా షిప్ లో ఆ దేశానికి చేర్చారు. కొద్దిరోజులుగా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల చిత్రీకరణలో మంచు విష్ణు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విష్ణు ప్రమాదం బారిన పడిన నేపథ్యంలో షూటింగ్ ఆగిపోయింది.
మంచు విష్ణుకు ఎలా ఉంది? ఆయన ప్రస్తుత కండీషన్ ఏంటి? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీంతో మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు స్వయంగా స్పందించారు. మంచు విష్ణు హెల్త్ అప్డేట్ పై ఆయన ట్వీట్ చేశారు. ‘మంచు విష్ణుకు ప్రమాదం జరిగిందని తెలిసి మీరు స్పందించిన తీరుకు కృతఙ్ఞతలు. ఆ దేవుని దయవల్ల మంచు విష్ణు కోలుకుంటున్నాడు. త్వరలో తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు. హర హర మహాదేవ.. అని కామెంట్ చేశారు.
దీంతో మంచు విష్ణు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కనీస మార్కెట్ లేని మంచు విష్ణు కన్నప్పతో సాహసం చేస్తున్నారు. అందుకే తెలివిగా స్టార్ క్యాస్ట్ ని గెస్ట్ రోల్స్ లో ఆయన నటింపజేస్తున్నారు. ఏకంగా ప్రభాస్ కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. ఆయన శివుడు పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అలాగే మలయాళ, కన్నడ సూపర్ స్టార్స్ … మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ సైతం కన్నప్పలో నటిస్తున్నారు.
ఇది సినిమాకు భారీగా కలిసొచ్చే అంశం. శ్రీకాళహస్తిలో ఆగస్టు నెలలో పూజా కార్యక్రమాలతో కన్నప్ప లాంచ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ నుపుర్ సనన్ హీరోయిన్ అనుకున్నారు. లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న నుపుర్ సనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. సాయి మాధవ్ బుర్ర, పరుచూరి బ్రదర్స్ మాటలు అందిస్తున్నారు.
https://twitter.com/themohanbabu/status/1719594743376884063?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719594743376884063%7Ctwgr%5Eeba3dd0ca20e6a5d2ec15519761830238a74cfef%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fmanchu-mohan-babu-shares-his-son-vishnu-health-update-1832391