Producer KP Chaudhary: ఎక్కడ ఏ డ్రగ్ పెడ్లర్ పట్టుబడినా మూలాలు టాలీవుడ్ లో దొరుకుతున్నాయి. డ్రగ్ పెడ్లర్స్, డీలర్స్ హీరోలు, హీరోయిన్స్, ఇతర చిత్ర ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. తాజాగా కబాలి నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి వ్యవహారం సంచలనం రేపుతోంది. తీగలాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది. ఒకప్పుడు చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కే పి చౌదరి డ్రగ్స్ దందా వైపు మళ్లారు. గోవాలో పబ్ ఏర్పాటు చేసి అక్కడ డ్రగ్స్ సప్లై చేశాడు. హైదరాబాద్ నుండి వెళ్లే ప్రముఖులకు తన పబ్ లో డ్రగ్స్ సప్లై చేసేవాడని సమాచారం.
ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ సప్ప్లై చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేపీ చౌదరి పోలీసుల కస్టడీ ముగియగా రిమాండ్ రిపోర్ట్ లో కొందరు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ కేపీ చౌదరి కన్స్యూమర్స్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్నారు. మరొక హీరోయిన్ ఐటెం భామగా కొన్ని చిత్రాల్లో సాంగ్స్ చేసింది. వీరిద్దరితో కేపీ చౌదరి వందలసార్లు మాట్లాడాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోయిన్స్ డ్రగ్ కన్స్యూమర్సా లేక డ్రగ్ పెడ్లర్స్ అనేది తెలియాల్సి ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం 12 మంది పేర్లు పొందుపరిచారు. ఆ హీరోయిన్స్ పేర్లు అప్పుడే బయటపెట్టబోమని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరనే చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ లో పాల్గొన్న హీరోయిన్, ఐటెం భామ అని హింట్ దొరగ్గా ఊహాగానాలు మొదలయ్యాయి. కేపీ చౌదరి మొబైల్ పలువురు చిత్ర ప్రముఖుల ఫోన్ నంబర్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే వారితో దిగిన ఫోటోలు ఉన్నాయి. కొందరు స్టార్స్ తో సన్నిహిత సంబంధాలు కేపీ చౌదరి కలిగి ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఫోన్ నెంబర్స్ ఉన్నంత మాత్రాన డ్రగ్స్ తో వాళ్లకు సంబంధం ఉన్నట్లు కాదని కేపీ చౌదరి వాదించినట్లు సమాచారం.