Kannappa: నటుడిగా, నిర్మాతగా ఐదు దశాబ్దాలకు పైగా ప్రస్థానం మోహన్ బాబు సొంతం. 500 లకు పైగా చిత్రాల్లో నటించిన హీరోనని ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. కానీ మోహన్ బాబు నట వారసులు విఫలం చెందారు. మంచు మనోజ్, విష్ణు, లక్ష్మి పరిశ్రమలోనే కెరీర్ వెతుకున్నారు. కానీ ఒక్కరు సఫలం కాలేదు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు దాటిపోయింది. చివరికి మోహన్ బాబు కూడా మనోజ్ తో సినిమాలు తీయడం ఆపేశాడు. ఆయన కేవలం మంచు విష్ణుతో మాత్రమే చిత్రాలు నిర్మిస్తున్నాడు.
రెండు దశాబ్దాల విష్ణు కెరీర్లో హిట్ మూవీ ఏదైనా ఉందా అంటే.. ఒక్క ఢీ మాత్రమే. ఒకటి రెండు యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు ఉన్నాయి. ఢీ మూవీ 2007లో విడుదలైంది. అంటే దశాబ్దాలుగా మంచు విష్ణుకు హిట్ లేదు. ఇక మంచు విష్ణు గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినా కమర్షియల్ గా ఆడలేదు. కనీసం కోటి రూపాయలు వసూలు చేయలేకపోయింది. జిన్నా కలెక్షన్స్ సన్నీ లియోన్ రెమ్యునరేషన్ ని కూడా కవర్ చేయలేదనే టాక్ ఉంది.
పాజిటివ్ టాక్ వచ్చినా జిన్నా సినిమాకు కలెక్షన్స్ రాలేదంటే… జనాలు మంచు విష్ణు సినిమాలను చూడటానికి థియేటర్స్ కి వెళ్లడం లేదని స్పష్టం అవుతుంది. ఈ పరిణామాల నడుమ మంచు విష్ణు ఏకంగా కన్నప్ప అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. కన్నప్ప బడ్జెట్ రూ. 100 కోట్లకు పైమాటే. మేజర్ షూటింగ్ పార్ట్ న్యూజిలాండ్ లో షూట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా.. కన్నప్పను డిస్ట్రిబ్యూటర్స్ కొంటారనే నమ్మకం లేదు. ఒకవేళ కొన్నా.. చాలా తక్కువ ధర ఆఫర్ చేస్తారు.
కాబట్టి మోహన్ బాబు ఓన్ గా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ క్యామియో చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకు వస్తారనే నమ్మకంతో కన్నప్ప మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ హీరోల క్యామియోలు, గెస్ట్ రోల్స్ సినిమాను కాపాడతాయి అనుకుంటే పొరపాటే. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ఏ విధంగా చూసినా కన్నప్ప మంచు ఫ్యామిలీకి భారీ రిస్క్. కన్నప్ప చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ బాబు, విష్ణు కుమార్తెలు సైతం నటిస్తున్నారు. కన్నప్పను మంచు ఫ్యామిలీ బయోపిక్ గా మార్చేశారు.