Manchu Manoj: మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ కి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. భౌతిక దాడులతో పాటు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబు మనుషుల నుండి తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే మనోజ్, మౌనికల నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ కమీషనర్ కి ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా డిసెంబర్ 14న మోహన్ బాబు సతీమణి నిర్మలాదేవి జన్మదినం. ఆ రోజు ఇంటికి వచ్చిన విష్ణు తన ఇంటి జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ పోశాడంటూ.. ఒక సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మనోజ్ ఆరోపణలను కన్న తల్లి నిర్మలాదేవి ఖండించారు. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులకు తన లేఖ సమర్పించారు.
నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. ఇంట్లో నా చిన్నకొడుక్కి ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. ఇంటి జెనరేటర్ లో విష్ణు మనుషులు చెక్కర కలిపిన డీజిల్ పోశారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. తన మనుషులతో ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. విష్ణు తన గదిలో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోయాడు. పని మనుషులు ఇక్కడ పని చేయలేమని మానేశారు. అంతే కానీ విష్ణు బెదిరించలేదు.. అంటూ లేఖలో పేర్కొన్నారు.
మనోజ్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని నిర్మలాదేవి లేఖతో స్పష్టం అయ్యింది. ఆమె ప్రకటన మనోజ్ కి బిగ్ షాక్ ఇచ్చింది. కాగా మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విద్యాదేవి మరణించడంతో ఆమె సొంత చెల్లెలు నిర్మలాదేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. విష్ణు, లక్ష్మి విద్యాదేవి పిల్లలు. మనోజ్ మాత్రమే నిర్మలాదేవి సంతానం. కన్న కొడుకును కాదని విష్ణుకు నిర్మలాదేవి సపోర్ట్ చేసినట్లు అయ్యింది.
Web Title: Mohan babu wife released the letter saying that manchu manoj is wrong
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com