Son Of India Movie Review: నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, రఘుబాబు.
దర్శకుడు: డైమండ్ రత్న బాబు
నిర్మాత: విష్ణు మంచు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటర్: గౌతం రాజు
మోహన్ బాబు హీరోగా వచ్చిన “సన్ ఆఫ్ ఇండియా” చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మోహన్ బాబు హీరోగా చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ:
విరూపాక్ష (మోహన్ బాబు) బాబ్జీగా మారి.. డ్రైవర్ గా, పోలీస్ ఆఫీసర్ గా ఇలా రకరకాల వేషాలు మారుస్తూ… మినిస్టర్ (శ్రీకాంత్)ను డాక్టర్ ను, మరో ఆఫీసర్ ను
కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తుంటాడు. అసలు ఈ విరూపాక్ష ఎవరు ? ఎందుకు వాళ్ళను ఎందుకు కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తుంటాడు ? ఇంతకీ విరూపాక్ష బాబ్జీగా ఎందుకు మారాడు ? అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? మధ్యలో ప్రైవేట్ జైలు అనే కాన్సెప్ట్ ఏమిటి ? దానితో అతను సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?
విశ్లేషణ :
విరూపాక్షగా మోహన్ బాబు నటన చాలా బాగుంది. గతం తాలూకు బాధను, అందుకు కారణం అయిన వ్యక్తులను అతను శిక్షించిన విధానం కొత్తగా ఉంది. అలాగే తన పాత్ర జీవితంలో జరిగిన పరిణామాలకి అనుగుణంగా మోహన్ బాబు కనబర్చిన నటన మెప్పించింది. ఇక అక్రమాలు చేసిన వ్యక్తుల పై హీరో పాత్ర చేసిన పోరాటాన్ని కూడా సినిమాలో బాగానే ఎలివేట్ చేశారు.
ముఖ్యంగా మోహన్ బాబు హర్ట్ టచింగ్ సీన్స్ లో తన హావాబావాలను చాలా బాగా పలికించారు. ఇక ఆఫీసర్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో ఆకట్టుకోలేకపోయింది. అలాగే విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా తేలిపోయాడు. అలాగే నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృధ్వీ రాజ్, సునీల్ పర్మార్మెన్స్ లు కూడా మామూలుగానే ఉన్నాయి.
దర్శకుడు డైమండ్ రత్న బాబు సినిమాని ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, సన్నివేశాలను దర్శకుడు రత్నాబాబు తెర పై ఆవిష్కరించిన విధానం అస్సలు బాగాలేదు. ఇంట్రెస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గాసాగింది. దీనికితోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సాగడం సినిమాకి మైనస్ అయింది. సాంకేతిక నిపుణుల పనితనం కూడా గొప్పగా ఏమి లేదు.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని యాక్షన్ సీన్స్,
నేపథ్య సంగీతం,
పాటలు
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
ప్లాష్ బ్యాక్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
‘వెరీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా’ అంటూ వచ్చిన ఈ ‘సన్ ఆఫ్ ఇండియా’ క్రిమినల్స్ తో పోరాడే వ్యక్తిగా కంటే.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే నిరుత్సాహ వీరుడిగానే నిలిచాడు. బోరింగ్ అండ్ రొటీన్ యాక్షన్ రెగ్యులర్ వ్యవహారాలు తప్పా.. సినిమాలో ఇంట్రెస్టింగ్ కహానీలు ఏమీ లేవు. కాబట్టి, ఈ సినిమా చూడక్కర్లేదు.
రేటింగ్ : 1.75 / 5
Also Read: హిజాబ్ వ్వవహారంలో బాధ్యులపై చర్యలుంటాయా?