Mohan Babu: సినీ ఇండస్ట్రీ అంటేనే ఎవరికీ ఓపికలుండవంటారు. అందరికీ ఇగో సమస్యలు. ఆ ఇగో వల్లే నేను గొప్ప అంటే నేను గొప్ప అని సినీ ప్రముఖులు తొడలు కొట్టేస్తుంటారు. అయితే అదంతా మీడియాకు, సోషల్ మీడియాకు ఎక్కడంతో అదిప్పుడు రచ్చరచ్చ అవుతోంది. ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటున్నారు. పరువు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్ బాబు విమర్శించారు. ‘సన్నాఫ్ ఇండియా’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలపై నోరుపారేసుకున్నారు.
Also Read:
1) మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?
2) చిరంజీవి, సురేఖల పెండ్లి ఫొటోను చూశారా.. చిరిగిన చొక్కాతోనే తాళి కట్టిన మెగాస్టార్..!
ఏపీ సీఎం జగన్ తో భేటికి తనకు కూడా ఆహ్వానం అందిందని.. కానీ కావాలనే కొందరు తనను దూరం పెట్టారని మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో పలువురు ఆర్టిస్టులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలపై మాట్లాడారు. ఇతర ఆర్టిస్టులు, వాళ్లు తీసుకుంటున్న పారితోషికాలపై కామెంట్ చేయనన్నారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతానని.. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారన్నారు.
సినీ ఇండస్ట్రీలో గోతులు వాళ్లే తీసుకుంటున్నారని.. బయట రాజకీయాల మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారని.. నా దృష్టిలో ఎవరూ గొప్ప కాదని.. మనం చేసే పనులన్నింటి పైన భగవంతుడు చూస్తున్నాడని తెలిపారు.
సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడానికి అందరం కలిసి వెళదామని రెండు నెలల క్రితం బహిరంగ లేఖ విడుదల చేశానని.. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. నటీనటులు, ఆర్టిస్టులు అందరికీ ఈగో ఉందని.. నిజం చెప్పాలంటే.. నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నామని.. కానీ గతంలో అలా ఉండేది కాదన్నారు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు.. ఇతర నటీనటులందరం కలిసి ఒకే చోట కూర్చొని ఎన్నో విషయాలపై మాట్లాడుకునే వాళ్లమని మోహన్ బాబు అన్నారు.
సీఎంవో నుంచి తనను పిలిచారని.. నాకు ఆహ్వానం అందిందని.. నన్ను రమ్మని సినీ ప్రముఖులు పిలవలేదని.. వాళ్లు పిలిచినా.. పిలవకపోయినా నాకు విలువ ఉందని.. నా పని నేను చేసుకుంటానని అన్నారు.
నా గురించి ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ అని.. ఎదుటి వాళ్ల మాటలను పట్టించుకోనని మోహన్ బాబు అన్నారు.
Also Read: