
Mohan Babu- Manchu Vishnu : సోషల్ మీడియా లో తరుచూ ట్రెండింగ్ లో ఉండే కుటుంబం మంచు కుటుంబం. ఏదో ఒక వివాదాస్పద పని చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గానే వార్తల్లో నిలుస్తుంటుంది ఈ కుటుంబం మొత్తం.మొన్నటి వరకు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఏది పడితే అది మాట్లాడి సోషల్ మీడియా లో మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చారు. రీసెంట్ గా మంచు మనోజ్ – మంచు విష్ణు మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా వరకు వచ్చింది.మనోజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విష్ణు మా పై దాడి చేయడానికి ఇంటికి వచ్చాడు అంటూ ఒక వీడియో అప్లోడ్ చేసాడు.
అది సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది.ఆ తర్వాత ఆ గొడవని కవర్ చేసుకునేందుకు మంచు విష్ణు మేమంతా ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేశామని, అందులో భాగంగానే మనోజ్ ఆ వీడియో వదిలాడు అంటూ కామెంట్ చేసి మరోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచాడు మంచు విష్ణు.
ఇప్పుడు రీసెంట్ గా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు కోసం ఇచ్చిన బహుమతి గురించి పెద్ద చర్చ నడుస్తుంది.అసలు విషయానికి వస్తే గత నెల 19 వ తేదీన మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విష్ణు రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ సూప్ కారుని బహుమతిగా ఇచ్చాడని, దీని ధర సుమారుగా 5 కోట్ల 25 లక్షల రూపాయిల వరకు ఉంటుందని తెలుస్తుంది.
మోహన్ బాబు కార్ గ్యారేజీ లో ఇప్పటి వరకు ఆడి క్యూ 7 , రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చూనర్ వంటి బ్రాండెడ్ కార్లు ఉన్నాయి.ఇప్పుడు ఆ జాబితాలోకి రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUV కూడా చేరిందని టాక్ నడుస్తుంది.అయితే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ వార్తపై మంచు కుటుంబం రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా రెస్పాండ్ అవ్వలేదు.