Homeఎంటర్టైన్మెంట్Mohan Babu: పవన్ కళ్యాణ్ దారిలోనే మోహన్ బాబు.. ఇది...

Mohan Babu: పవన్ కళ్యాణ్ దారిలోనే మోహన్ బాబు.. ఇది జగన్ షాకే

Mohan Babu: ‘మంచు ఫ్యామిలీ’ గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ట్రోలింగ్ కి గురి అవుతూ వస్తోంది. కోపం వస్తే.. మోహన్ బాబు వృద్ధ సింహంలా బూతులతో గర్జిస్తున్నారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ రెచ్చిపోతున్నారు. అయితే, ఈ రోజు మోహన్ బాబు కుటుంబం కోర్టుకు హాజరైంది. అయితే కోర్టుకు పాదయాత్ర ద్వారా హాజరు కావడం విశేషం. ఎందుకు ఈ పాదయాత్ర అని మోహన్ బాబును మీడియా ప్రశ్నిస్తే.. నేను పాదయాత్రగా వచ్చానని ఎవరు చెప్పారంటూ కోపాన్ని ప్రదర్శించారు.

Mohan Babu
Mohan Babu, modi

మోహన్ బాబు జస్ట్ ఎదురు ప్రశ్నించడమే కాదు, తాను రియల్‌ హీరోను అని.. తనకు చాలామంది అభిమానులు ఉన్నారని.. వారందరినీ ఆత్మీయంగా మాట్లాడేందుకే నడుచుకుంటూ వచ్చాను అని కొత్త కబుర్లు చెప్పారు. ఏమిటో మోహన్ బాబు ?.. ఈయన ఏమైనా మెగాస్టార్ చిరంజీవి అనుకుంటున్నాడా ? అంటూ నెటిజన్లు మళ్ళీ ట్రోల్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు అనుకోండి.

Also Read: Actor Poo Ramu Passes Away: విషాదం : లెజెండరీ నటుడు మృతి.. సూర్య కంట కన్నీళ్లు

అయితే, మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ కామెంట్స్ జగన్ కి వ్యతిరేకంగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం.. గత ఎన్నికల్లో మోహన్ బాబు ఫ్యామిలీ వైసీపీకి జై కొట్టారు. పైగా ఆ ఎన్నికల్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి.. జగన్ కి మేలు చేసే ప్రయత్నం చేసింది మంచు కుటుంబం. అసలు చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేయడమే కాకుండా.. మోహన్ బాబు, చంద్రబాబును బూతులు కూడా తిట్టారు.

జగన్ కు జై అన్నారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత.. మోహన్ బాబు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ గెలిచి సీఎం అయ్యాక, మోహన్ బాబును దూరం పెట్టారు. దాంతో వైసీపీకి కూడా మోహన్ బాబు దూరం అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆ దూరం బాగా పెరిగిందని అర్థం అవుతుంది. తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.

Mohan Babu
Mohan Babu

ఇంతకీ మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే.. నేను బీజేపీ మనిషిని అంటూ ఆయన ప్రకటించారు. పైగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాదయాత్రలతో వచ్చే పబ్లిసిటీ తనకు అవసరం లేదని కామెంట్స్ చేశాడు. కేవలం విద్యార్థుల కోసం పోరాడితే అక్రమంగా తన పై కేసులు పెట్టారని మోహన్ బాబు చివరకు ఆవేదనను కూడా వ్యక్తం చేశారు.

చివరగా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మొత్తానికి పవన్ దారిలోనే మోహన్ బాబు కూడా ప్రయాణం మొదలు పెట్టారు. ఇది జగన్ షాకే.

Also Read:Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కి ఆ గతి పట్టడానికి కారణం త్రివిక్రమా??

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version