https://oktelugu.com/

Mohan Babu: నీ ఆవేశం సల్లగుండ… జయసుధ ఫోన్‌ లాక్కున్న మోహన్‌ బాబు.. వీడియో వైరల్‌..

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Written By: , Updated On : September 20, 2023 / 05:01 PM IST
Mohan Babu

Mohan Babu

Follow us on

Mohan Babu: చింత చచ్చినా.. పులుపు చావదు.. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తీరు కూడా ఇలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీలో తనో ఔట్‌ డేటెడ్‌ నటుడు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో మాత్రం వార్తల్లో నిలుస్తుటారు. ఇక ఆయన కొడుకులదీ అదే పరిస్థితి. అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మా అధ్యక్షుడిగా తన కొడుకు ఉన్నా.. ఇండస్ట్రీకి ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతటి దీన స్థితిలో ఉన్నా.. మోహన్‌బాబులో మాత్రం ఆవేశం తగ్గలేదు. ఇందుకు తాజాగా ఏఎన్‌ఆర్‌ విగ్రహావిష్కరణ వేడుకల్లో చోటుచేసుకున్న ఇన్సిడెంటే ఉదాహరణ.

ఏం జరిగిందంటే..
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు తెలుగు తారాగణం తరలి వచ్చింది. అలనాటి నటీనటులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, సహజ నటి జయసుధ సమావేశంలో పక్కప్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తుండగా సీనియర్‌ నటి జయసుధ ఫోన్‌ చూస్తూ కనిపించారు. గమనించిన మోహన్‌బాబు ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశారు. ‘మడిచి లోపల పెట్టుకో’ అన్నట్లుగా జయసుధ ఫోన్‌ను పర్సులో పెట్టే ప్రయత్నం చేశారు’ నాగేశ్వరరావు గురించి మాట్లాడుతుంటే ఫోన్‌ చూడడం ఏంటి అన్నట్లుగా వ్యవహరించారు. మోహన్‌బాబు ఆవేశంలో నాగేశ్వరరావుపై ప్రేమతోపాటు జయసుధపై అసహనం లేదా ఆమోతో ఉన్న సాన్నిహిత్యం స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తరలి వచ్చిన టాలీవుడ్‌..
ఇదిలా ఉండగా నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు టాలీవుడ్‌ కదిలి వచ్చింది. టాలీవుడ్‌ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగార్జున చరణ్‌ను ఆహ్వానించారు. రామ్‌ చరణ్‌ ఏఎన్‌ఆర్‌ విగ్రహానికి పూలుచల్లి నివాళులర్పించారు. నేచురల్‌ స్టార్‌ నాని నాగేశ్వరావు విగ్రహ ఆవిష్కారానికి హాజరయ్యారు. నాగేశ్వరావుకు నివాళులర్పించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏఎన్‌ఆర్‌ విగ్రహా ఆవిష్కరణ చేశారు.