Homeఎంటర్టైన్మెంట్Mohan Babu: మధుమితపై ఫైర్ అయిన మోహన్ బాబు ... వైరల్ అవుతున్న వీడియో ?

Mohan Babu: మధుమితపై ఫైర్ అయిన మోహన్ బాబు … వైరల్ అవుతున్న వీడియో ?

Mohan Babu: టాలీవుడ్ లో ఈ సారి జరిగిన మా ఎలక్షన్ లు మీడియా లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సాధారణ రాజకీయాలను తలపించే రేంజ్ లో ఎంతో ఉత్కంఠ‌గా జ‌రిగిన ఈ ఎన్నికలలో… మంచు విష్ణు విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఇటీవల విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 మంది సభ్యులు… ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎ వేదికగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో మోహన్ బాబు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అవ్వడం సినివర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

mohan-babu-fires-on-madhumitha

ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ నా జీవితం తెరిచిన పుస్తకం, నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నానని అన్నారు. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరోగా చేశానని… మనమంతా ఒకే తల్లి బిడ్డలం అంటూ తెలిపారు. మనుషుల్లో టాలెంట్‌ ఉంటే అవకాశాలు వస్తాయని… కేవలం టాలెంట్‌ తోనే ఇక్కడ కొనసాగుతారు అంటూ చెప్పారు. ఇది రాజకీయ వేదిక కాదని… పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను అని మోహన్‌ బాబు పేర్కొన్నారు.

Mohan Babu Angry on Siva Balaji Wife Madhumitha | Maa 2021 Oath Ceremony | Sakshi TV

అయితే స్పీచ్‌ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్‌ అయ్యారు. పెద్దలు స్పీచ్‌ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version