https://oktelugu.com/

Adipurush- Modi Government: ఆదిపురుష్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మోడీ సర్కార్

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది ఈ ట్రైలర్ ని చూస్తుంటే. ఇక థియేటర్ లో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందో అని ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్

Written By:
  • Vicky
  • , Updated On : May 9, 2023 / 06:12 PM IST

    Adipurush- Modi Government

    Follow us on

    Adipurush- Modi Government: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నేడు కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.

    అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది ఈ ట్రైలర్ ని చూస్తుంటే. ఇక థియేటర్ లో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందో అని ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఆదిపురుష్ తెలుగు ట్రైలర్ కంటే కూడా, హిందీ ట్రైలర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ ఇండియన్స్ లో శ్రీ రాముడు అంటే ఎంత భక్తి భావం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    ఇక రామాయణం ని సరికొత్త టెక్నాలజీ తో ఇంత అద్భుతంగా చూపిస్తే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అనడానికి ఉదాహరణ, ఈరోజు విడుదలైన ట్రైలర్. ఇకపోతే శ్రీ రాముడి చరిత్రని ఇంత వైభోగంగా చూపిస్తున్నందుకు, ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఫుల్ సపోర్టు ఉందట. అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపు చేయబోతోందని తెలుస్తుంది, అదే కనుక జరిగితే ఈ సినిమా బాహుబలి 2 ఫుల్ రన్ గ్రాస్ ని క్రాస్ చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    బాహుబలి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆదిపురుష్ చిత్రానికి పన్ను మినహాయింపు కారణంగా బాహుబలి కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు మేకర్స్,మరి అది నిజం అవుతుందో లేదో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.