https://oktelugu.com/

Mahesh- Trivikram Movie: బిగ్ బ్రేకింగ్ : మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్..కారణం అదేనా!

అయితే సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందా, లేదా ప్రస్తుతం ప్లాన్ చేసిన షెడ్యూల్ వరకు క్యాన్సిల్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన శ్రీలీల మరియు పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Written By: , Updated On : May 9, 2023 / 06:15 PM IST
Mahesh- Trivikram Movie

Mahesh- Trivikram Movie

Follow us on

Mahesh- Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారుగా నెలరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆగిపోయింది అంటూ ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. రీసెంట్ గా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన వెంటనే షూటింగ్ ని రద్దు చెయ్యమని చెప్పాడట.

అందుకు కారణం ఇప్పటివరకు తీసిన ఔట్పుట్ మహేష్ బాబు కి ఏమాత్రం నచ్చలేదట. ఆ షూట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా తియ్యాలని త్రివిక్రమ్ ని ఆదేశించాడట. అయితే త్రివిక్రమ్ రీసెంట్ గానే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మహేష్ కి వినిపించాడట, కానీ మహేష్ సంతృప్తి పడకపోవడం తో షూటింగ్ ని ఆపివెయ్యమని ఆదేశించారట.

అయితే సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందా, లేదా ప్రస్తుతం ప్లాన్ చేసిన షెడ్యూల్ వరకు క్యాన్సిల్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన శ్రీలీల మరియు పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఊరమస్ యాంగిల్ లో తీస్తున్నట్టు సమాచారం.

వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఫస్ట్ లుక్ ద్వారా అధికారికంగా తెలియచేసారు మేకర్స్,విడుదల తేదికి ఇంకా చాలా సమయం ఉన్నందున షూటింగ్ నిదానంగానే చేసుకోవచ్చని, ది బెస్ట్ ఔట్పుట్ తోనే మనం ప్రేక్షకుల ముందుకి రావాలని మహేష్ త్రివిక్రమ్ తో అన్నాడట, మరోపక్క ఎలా తీసిన మహేష్ సంతృప్తి చెందకపోవడం వల్ల త్రివిక్రమ్ చాలా నిరాశ లో ఉన్నట్టు తెలుస్తుంది.