https://oktelugu.com/

‘ఇళయరాజా’తో కీరవాణి… స్టూడియో వెనుక కథ !

మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి అని అంటుంటారు. అయితే, చెన్నైలో సొంతంగా ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకోవాలని ఇళయరాజా చిరకాల కోరిక అట. మొత్తానికి ఇటీవల తన కోరికను ఆయన తీర్చుకున్నారు. ఇక ఇళయరాజా స్టూడియోని చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే వచ్చి వెళ్లారు. కాగా తాజాగా తెలుగు ప్రస్తుత దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా ఇళయరాజా స్టూడియోకి వెళ్లి ఆయనతో […]

Written By:
  • admin
  • , Updated On : July 26, 2021 / 09:58 AM IST
    Follow us on

    మాస్ట్రో ఇళయరాజా అంటేనే సంగీత ప్రపంచంలో తిరుగులేని మేటి అని అంటుంటారు. అయితే, చెన్నైలో సొంతంగా ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకోవాలని ఇళయరాజా చిరకాల కోరిక అట. మొత్తానికి ఇటీవల తన కోరికను ఆయన తీర్చుకున్నారు. ఇక ఇళయరాజా స్టూడియోని చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు.

    ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే వచ్చి వెళ్లారు. కాగా తాజాగా తెలుగు ప్రస్తుత దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా ఇళయరాజా స్టూడియోకి వెళ్లి ఆయనతో ఒక ఫోటో తీసుకుని మరీ ముచ్చట పడ్డారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ సాంగ్ పని మీద చెన్నై వెళ్లిన కీరవాణి, అనుకోకుండా నుంగంబాక్కం నుంచి వెళ్తుండగా ఇళయరాజా స్టూడియో కనిపించిందట.

    వెంటనే అక్కడ ఆగి, స్టూడియోలోకి వెళ్లి ఇళయరాజా వారిని కలుసుకుని.. కాసేపు ఆయనతో ముచ్చట్లు పెట్టి సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఇళయరాజా సొంతంగా నందంబాక్కంలోని కామ దార్ నగర్ రోడ్ లో స్టూడియో కట్టుకోవడానికి వేరే కారణం ఉందట. ఇళయరాజా చాలా కాలం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలోనే తన పాటల రికార్డింగ్ జరిపేవారు.

    కాకపోతే ఇటీవల ప్రసాద్ స్టూడియో యాజమాన్యంతో ఇళయరాజాకు గొడవ అయింది. ఆ గొడవ తర్వాత ప్రసాద్ యాజమాన్యం, రాజాని అక్కడ నుండి వెకేట్ చేయించారు. దాంతో ఆయన అది అవమానంగా భావించి, వారికీ పోటీగా ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టాలని కసితో ఈ స్టూడియో కట్టారని అంటుంటారు.